Tue. Apr 21st, 2026
Rishab Shetty: ఎన్టీఆర్ హీరోయిన్‌కు రిషబ్ శెట్టి షాక్.. ‘కాంతార’లో అసలేమైంది?

Rishab Shetty: కన్నడ ఇండస్ట్రీలో ఒక దర్శకుడిగా, హీరోగా తన ప్రస్థానాన్ని మొదలు పెట్టిన రిషబ్ శెట్టి.. ‘కాంతార’ చిత్రంతో పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగాడు. ఇటీవల కాలంలో ఈ స్టార్ హీరో ఇన్‌స్టా స్టోరీ ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇంతకీ ఆ వైరల్ ఇన్‌స్టా స్టోరీ ఆయన పోస్ట్ చేసింది కాదు.. తన ఇన్‌స్టా ఫాలోవర్స్ అన్‌ఫాలో గురించి. అసలు ఏం జరిగిందో ఈ స్టోరీలో తెలుసుకుందాం. రిషబ్ శెట్టి తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో తీసుకున్న ఒక నిర్ణయం ఇప్పుడు సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారి తీసింది. ఈ స్టార్ హీరో తన ఇన్‌స్టా ఫాలోయింగ్ లిస్ట్‌ను తగ్గించుకుని, కేవలం మూడు అకౌంట్లను మాత్రమే ఫాలో అవుతున్నాడు. ఈ మూడు అకౌంట్లలో కూడా ఒకటి తన భార్య ప్రగతి శెట్టిది కాగా, మిగిలిన రెండు ఆయన సొంత నిర్మాణ సంస్థ, స్వచ్ఛంద సంస్థకు సంబంధించినవి ఉన్నాయి.

READ ALSO: Giant Information : రేపటి నుంచి దేశవ్యాప్తంగా పెరగనున్న సిమెంట్‌ ధరలు

అయితే ఇక్కడే ఈ ఇన్‌స్టా స్టోరీ వైరల్‌‌గా మారింది. ఉన్నట్లుండి రిషబ్ శెట్టి ఇలా అందరినీ అన్‌ఫాలో చేయడానికి గల కారణంపై ఏమై ఉంటుందనే దాని గురించి సోషల్ మీడియాలో రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇటీవల ఆయన తన సూపర్ హిట్ చిత్రం కాంతార చాప్టర్ 1.. హీరోయిన్ రుక్మిణి వసంత్, ఆ చిత్ర నిర్మాణ సంస్థ హోంబలేని ఇన్‌స్టా వేదికగా అన్‌ఫాలో చేయడం పెద్ద చర్చకు దారి తీసింది. అయితే ఆ సమయంలో ఈ స్టార్ హీరో హోంబలే అధినేత విజయ్ కిరగందూర్‌ను మాత్రం ఫాలో అయ్యారు. కానీ తాజాగా ఆయన మరోసారి తను ఫాలో అయ్యే వారి లీస్ట్ నుంచి అందరినీ అన్‌ఫాలో చేసి కేవలం తన భార్య ప్రగతి శెట్టిని, తన నిర్మాణ సంస్థ, స్వచ్ఛంద సంస్థను మాత్రమే ఫాలో చేస్తున్నారు. ఈ కన్నడ స్టార్‌ను పాన్ ఇండియా స్టార్‌గా నిలిపిన చిత్రం ‘కాంతార’. ఈ చిత్రాన్ని నిర్మించిన హోంబలే ఫిల్మ్స్, తన సన్నిహితులను ఆయన అన్‌ఫాలో చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ప్రస్తుతం ఈ స్టార్ హీరో ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో ‘జై హనుమాన్’ వంటి భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ఈ ఇన్‌స్టా అన్‌ఫాలో వెనుక ఏముందో తెలుసుకోవాలంటే.. దానిపై రిషబ్ శెట్టి స్పందించే వరకు ఆగాల్సిందే.

View this submit on Instagram

A submit shared by way of Rishab Shetty (@rishabshettyofficial)

READ ALSO: Unit 8200 Israel: మొస్సాద్‌‌ను మించిన దళం.. ఇరాన్ సామ్రాజ్యాన్ని కుప్పకూల్చిన ఇజ్రాయెల్ అదృశ్య సైన్యం!