Tue. Apr 21st, 2026

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న అల్లు అర్జున్ – అట్లీ సినిమా అప్‌డేట్‌పై క్లారిటీ వచ్చింది. ఈ సినిమాకు సంబంధించి కేవలం టైటిల్ పోస్టర్‌ను మాత్రమే విడుదల చేయనున్నట్లు వస్తున్న వార్తలు నిజమయ్యాయి. ఎటువంటి వీడియో కంటెంట్ లేదా టీజర్ విడుదల చేసే ఆలోచన లేదని సమాచారం.

నిర్మాత బన్నీ వాస్ ఒక కార్యక్రమంలో ఈ విషయాన్ని ధృవీకరించాడు. ‘నాకు తెలిసినంత వరకు కేవలం టైటిల్ మరియు పోస్టర్ మాత్రమే వస్తాయి. ఎటువంటి విజువల్ కంటెంట్ విడుదల కావడం లేదు. ఇది చాలా ప్రత్యేకమైన సినిమా కావడంతో, చిత్ర యూనిట్ ప్రస్తుతానికి విజువల్స్ రివీల్ చేయకూడదని నిర్ణయించుకుంది’ అని ఆయన పేర్కొన్నాడు. దీంతో అల్లు అర్జున్ అభిమానులు సినిమా ప్రపంచాన్ని చూడటానికి మరికొంత కాలం వేచి చూడక తప్పదు.

సన్ పిక్చర్స్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ ఫాంటసీ యాక్షన్ ఎంటర్టైనర్‌లో దీపికా పదుకోనె హీరోయిన్‌గా నటిస్తోంది. సాయి అభ్యంకర్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నాడు. అల్లు అర్జున్ బర్త్‌డే రోజున వెలువడనున్న ఆ పవర్‌ఫుల్ టైటిల్ ఏంటో అని సోషల్ మీడియాలో ఇప్పటికే చర్చ మొదలైంది.

The publish కన్ఫర్మ్ : బన్నీ బర్త్ డే రోజున వచ్చే ట్రీట్ ఇదే – బన్నీ వాస్ first gave the impression on Newest Telugu Film Information, Opinions, OTT, OTT Opinions, Rankings.