విడుదల తేదీ : జూన్ 12, 2026
123తెలుగు.కామ్ రేటింగ్ : 3.25/5
నటీనటులు : అయాన్, అహిల్యా బమ్రూ, విజయ్ దేవరకొండ, షాలిని కొండెపూడి, బెనర్జీ, రాహుల్ రవీంద్రన్, తులసి, నివేత పెత్తురాజ్ తదితరులు
దర్శకత్వం : సింగీతం శ్రీనివాసరావు
సంగీతం : దేవిశ్రీ ప్రసాద్
నిర్మాత : నాగ్ అశ్విన్
ఛాయాగ్రహణం : అనుకూర్ సి
సంబంధిత లింక్స్ : ట్రైలర్
ఇండియన్ సినిమా దగ్గర ఎన్నో అద్భుతమైన చిత్రాలు, ప్రయోగాలు చేసిన లెజెండరీ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు గారి నుంచి వచ్చిన మరో కొత్త ప్రయోగ చిత్రమే ‘సింగ్ గీతం’. తన 90ల వయస్సులో కూడా దర్శకత్వం మీద ఎంతో ఫ్యాషన్ తో చేసిన ఈ చిత్రానికి నాగ్ అశ్విన్ విజన్ కూడా తోడై తెరకెక్కిన ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు సమీక్షలో చూద్దాం రండి.
కథ:
బీహార్ జైలు నుంచి తన సొంత ఊరు ‘కుబేర పురం’ అనే ఓ కుగ్రామానికి తిరిగి వస్తాడు ప్రతాప్ మన్నెం (అయాన్). తన తండ్రి ఉదయ్ మన్నెం (రాహుల్ రవీంద్రన్) కి అక్కడే విలువైన బంగారు గనులు ఉన్నాయని వాటిని తన సొంతం చేసుకోవాలనే ప్లాన్ తో వస్తాడు. కానీ అప్పటికే ఆ బంగారు గని సంపద అంతా తనకే దక్కాలనే నెపంతో బ్రహ్మయ్య (బెనర్జీ) తన కూతురు రేణు (షాలిని కొండెపూడి) తో కలిసి మరో ప్లాన్ చేస్తాడు. అలా ఊరి జనం నుంచి భూములు తీస్కొని వారితోనే గనుల్లో పనులు చేయిస్తారు. ఇంకోపక్క ఆ ఊరి మొత్తానికి ఉండే ఒకే ఒక్క చెట్టు దానిలో తన అమ్మని చూసుకునే గౌరీ (అహిల్యా బమ్రూ) వల్ల ఆ ఊరికి ఒక్కసారిగా జరిగిన మార్పు ఏంటి? ఎందుకు వారి మాటలు అంతా ఒక్కసారిగా పాటలుగా మారిపోయాయి? మళ్ళీ వారంతా మామూలు అయ్యారా లేదా? ఆ ఊరికి పట్టిన శాపం ఏంటి? అసలు ఆ ఊరి గత చరిత్ర ఏంటి? ఈ చిత్రం ద్వారా సింగీతం గారు ఏం చెప్పాలనుకున్నారు అనేది తెలియాలి అంటే వెండితెరపై ఈ సినిమా చూడాల్సిందే.
ప్లస్ పాయింట్స్:
ఈ చిత్రంలో హీరోయిన్ పాత్ర కోరుకునే మూడు బలమైన కోరికలు ఏ రీతిలో బలాన్ని చేకూర్చాయో అదే విధంగా ఈ సినిమాకి ముగ్గురి పనితనం మాత్రం ఈ వినూత్న ప్రయత్నాన్ని మరో స్థాయికి తీసుకెళ్లింది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అదే సింగీతం శ్రీనివాసరావు గారి క్లాసిక్ ఆలోచన, దర్శకత్వం అలానే దేవిశ్రీ ప్రసాద్ సంగీతం వీరితో పాటుగా నిర్మాత నాగ్ అశ్విన్ అనే చెప్పొచ్చు. వీరు ముగ్గురే సినిమాని ఎంతో బలమైన పునాది వేసి చెక్కు చెదరకుండా నిలబెట్టారు.
మొదటిగా సింగీతం గారి విషయానికి అయితే ఈ సినిమా చూసాక తన ఫిల్మోగ్రఫీ అంటే బేసిక్ ఐడియా ఉన్నవారికి అయినా ఆయనపై గౌరవం మరింత పెరిగి తీరుతుంది. ఇప్పటికే ఎన్నో క్లాసిక్ సినిమాలు దశాబ్దాలు గడిచినా గుర్తుండేలా దశాబ్దాల కితమే అప్పటి స్థాయికి మించిన ఆలోచనలతో తెరకెక్కించిన సినిమాల లిస్ట్ లో సింగ్ గీతాన్ని కూడా చేర్చవచ్చు.
ఇలాంటి ఒక ఆలోచన రావడం ఒకెత్తు అయితే దానిని ఇప్పుడు జెనరేషన్ ఆడియెన్స్ కి తగ్గట్టుగా తెరకెక్కించి దర్శకత్వం వహించడం అనేది మరొక ఎత్తు. పైగా ఇందులో అంతర్లీనంగా సాగే ఎమోషన్స్ ని కూడా చాలా బలంగా ఎస్టాబ్లిష్ చేయడం అనేది చూసే సగటు ప్రేక్షకుణ్ణి కాదు తనలోని మనిషిని ప్రశ్నించేలా చేస్తుంది.
అత్యాశ, దురాశలు, వాటి మూలాన చేజేతులా మన ప్రకృతిని, పక్కనే ఉన్న తోటి మనిషి తాలూకా కష్టాన్ని కూడా ఎలా మర్చిపోతున్నాం అనే పాయింట్ ని అద్భుతమైన ఆలోచనా విధానంతో ఒక అందమైన చందమామ కథలా తెరకెక్కించడం అనేది మాత్రం సింగీతం గారికే చెల్లుతుంది. సినిమాలో కొన్ని ఎమోషనల్ ట్విస్ట్ లుకూడా అదిరిపోతాయి. అయితే తన ఆలోచనలో మెయిన్ పాయింట్ సంగీతం దానిని సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ పూర్తి న్యాయం చేకూర్చారు.
సింగీతం గారి ఆలోచనకి దేవిశ్రీ ప్రసాద్ లాంటి ప్రయోగాత్మక సంగీత దర్శకుడు తోడైతే ఎలా ఉంటుందో ఈ సినిమా కథనం చూస్తే అర్ధం అవుతుంది. ఇలాంటి ఒక సినిమాని దాదాపు మాటల్ని సాహిత్యంతోనే నడిపించడం అందులోని అలరించే సంగీతంతో నడిపించడం అనేది ఖచ్చితంగా సాధారణ విషయం కాదు. దీనిని దేవిశ్రీ ప్రసాద్ చేసి చూపించారు.
ఇంకా తన వర్క్ కోసం చెప్పాలంటే ప్రెజెంట్ కొనసాగుతున్న కొందరు టాప్ సంగీత దర్శకులు స్టైల్ లో దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించగలడు ఏమో కానీ ఇలాంటి సినిమాలకి దేవిశ్రీ ఇచ్చినలాంటి వర్క్ ని వారు ఇవ్వగలరా? ఇది ఒక్క డీఎస్పీకి మాత్రమే సాధ్యం అనేలా తన వర్క్ ఈ సినిమాలో ఉంది.
ఇక నిర్మాత నాగ్ అశ్విన్ కల్కి సినిమాకి ముందు నుంచే సింగీతం గారితో ప్రయాణంలో ఉన్నారు. ఆయనపై ప్రేమ, తన ఆలోచనకి తాను ఖర్చు పెట్టిన ప్రతీ పైసా వృధా పోలేదు. ఇక సినిమాలో నటీనటులు కూడా చాలా బాగా చేసారు. అయాన్, అహిల్యా సహా ఇతర తారాగణం అందరికీ ఈ సినిమా ఒక ఛాలెంజ్ వంటిదే. దాదాపు అన్ని పాత్రలు కూడా సినిమాలో సమాన ప్రాముఖ్యత కలిగిన రీతిలో డిజైన్ చేయబడి ప్రెజెంట్ చేయడం బాగుంది.
అలానే క్లైమాక్స్ లో వచ్చిన సర్ప్రైజ్ క్యామియో అందులో సెన్సేషనల్ స్టార్ కూడా అదరగొట్టాడు.
మైనస్ పాయింట్స్:
ఈ చిత్రంలో ఎన్నో మంచి విషయాలు ఉన్నప్పటికీ అక్కడక్కడా లూప్ హొల్స్ లాంటివి కనిపిస్తాయి. ఒక ఫాంటసీ టచ్ ఉన్నప్పటికీ రియాలిటీ పరంగా కొన్ని విషయాలు చాలా దూరంగా అనిపిస్తాయి. ఎక్కడో ఉండే గ్రామం అందులోని చాలా తక్కువ జనాభా, ఒకప్పుడు ఎంత ఉన్నారో ఇప్పటికీ అంతే ఉండడం అంత దూరం ఎలక్ట్రిసిటీ, లగ్జరీ కార్లు ప్రయాణం ఇలా ఇతర కొన్ని అంశాలు కొంచెం లాజిక్ కి దూరంగా అనిపిస్తాయి.
వీటితో పాటుగా అబద్దం చెప్పలేరు అనే అంశాన్ని ఇంకొంచెం ఓ చోట సింపుల్ గా తేల్చేసినట్టు అనిపిస్తుంది. అలానే ఇందులో చూపించే అందమైన ఫాంటసీ కథలు మనం ఆల్రెడీ విన్నవే చూసినట్టే ఉంటాయి కాబట్టి మరీ కొత్తదనం కోరుకునేవారికి అవి కొంచెం రెగ్యులర్ గా అనిపిస్తాయి. అలానే సెకండాఫ్ లో దేవిశ్రీ స్కోర్ ఓ బిట్ సాంగ్ తన కుబేర స్టైల్ లో నడిపించడం కొంచెం కొత్తదనం తగ్గించినట్టు అనిపిస్తుంది.
సాంకేతిక వర్గం:
ఈ చిత్రంలో నిర్మాణ విలువలకి ఎలాంటి వంకలు పెట్టడానికి లేదు. నాగ్ అశ్విన్ అండ్ టీం సినిమాకి ఎక్కడెక్కడ ఎంత కావాలో ఆ రేంజ్ లో ఖర్చు చేసి అవుట్ పుట్ పరంగా ఎక్కడా వెనకాడలేదు. అనుకూర్ సి అందించిన కెమెరా వర్క్ చాలా బాగుంది. ఎడిటింగ్ కూడా డీసెంట్ అని చెప్పొచ్చు. సాహిత్యం, అందులోనే డైలాగులుతో నడిపించిన సాహిత్య బృందం అందరికీ ప్రత్యేక మెన్షన్ అందించాల్సిందే. ఇక దేవిశ్రీ ప్రసాద్, సింగీతం గార్ల కోసం పైన ఆల్రెడీ చెప్పినట్టుగానే ఇద్దరి పౌనఃపుణ్యం సమాంతరంగా పర్ఫెక్ట్ గా ఎస్టాబ్లిష్ అయ్యింది.
తీర్పు :
ఇక మొత్తంగా చూసినట్టు అయితే ఈ ‘సింగ్ గీతం’ అనే చిత్రం సింగీతం శ్రీనివాసరావు గారి నుంచి మరో వినూత్న విజయ ప్రయత్నం. 40 ఏళ్ల కితమే తనకి వచ్చిన ఈ ఆలోచన ఇప్పటికీ మెప్పించే విధంగా ఉంది అంటే ఆయన ఏ రీతి దర్శకుడు అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తనకి తగ్గట్టుగా పాటలు, సంగీతం ప్రధానంగా సాగిన ఈ సినిమాలో దేవిశ్రీ ప్రసాద్ పనితనం కూడా మరో బిగ్గెస్ట్ హైలైట్ గా నిలిచింది. నటీనటుల పెర్ఫామెన్స్ లు కూడా మరింత ప్లస్ అయ్యాయి. చిన్నపాటి పొరపత్యాలు ఉన్నాయి కానీ వాటిని మిగతా అంశాలు కప్పేస్తాయి. సో సింగీతం గారి మార్క్ విజన్ తో కూడిన అందమైన చందమామ కథ లాంటి సినిమా చూడాలి అనుకుంటే ఈ వారాంతంలో ఫ్యామిలీతో కలిసి ధారాళంగా ఈ సినిమాని వీక్షించవచ్చు.
123telugu.com Ranking: 3.25/5
Reviewed via 123telugu Workforce
Click on Right here For English Overview
The put up సమీక్ష: ‘సింగ్ గీతం’ – అలరించే మ్యూజికల్ ఫాంటసీ డ్రామా first seemed on Newest Telugu Film Information, Opinions, OTT, OTT Opinions, Rankings.
