Thu. Jun 25th, 2026
Vijay – Trisha Breakup; ఒక్క పోస్టుతో అందరి నోళ్ళు మూయించిన త్రిష

తమిళనాడు ఎన్నికలకు ముందు నుంచి స్టార్ హీరో విజయ్, హీరోయిన్ త్రిష మధ్య ఏదో ఉందనే ప్రచారం పెద్ద ఎత్తున సాగుతూ వచ్చింది. దానికి తోడు విజయ్ విడాకుల కేసు ప్రస్తావన కూడా ఈ ప్రచారాలకు మరింత ఊపునిచ్చింది. అయితే వీరిద్దరికీ బ్రేకప్ అయిందని, ఎందుకంటే నిన్న విజయ్ పుట్టినరోజు సందర్భంగా ఆమె విజయ్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలపలేదని.. దానికి తోడు ఇన్‌స్టాగ్రామ్‌లో విజయ్ ని ఆమె ప్రస్తుతం ఫాలో అవ్వడం లేదు, అన్‌ఫాలో చేసింది కాబట్టి వారిద్దరి మధ్య ఏదో జరిగి ఉంటుందని, బ్రేకప్ అయిందని ప్రచారం జరిగింది.

అయితే ఆ ప్రచారాలు అన్నింటికీ ఒకే ఒక పోస్టుతో ఆమె సమాధానం ఇచ్చింది. విజయ్ తో కేక్ కటింగ్ చేస్తున్న ఫోటో షేర్ చేసిన ఆమె, “హ్యాపీ బర్త్‌డే టూ ది పర్సన్ హూ మేక్స్ ఇట్ ఆల్ వర్త్” అంటూ కామెంట్ చేసింది. దీంతో ఈ ఉదయం నుంచి త్రిష, విజయ్ బ్రేకప్ అంటూ సాగుతున్న ప్రచారానికి బ్రేక్ వేసినట్టు అయింది.

View this publish on Instagram

A publish shared by way of Trish (@trishakrishnan)