Wed. Jul 29th, 2026

మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘ఇరుముడి’ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఈ సినిమా విడుదల వాయిదా పడనుందంటూ వస్తున్న వార్తలకు చెక్ పెడుతూ, మేకర్స్ రిలీజ్ డేట్‌ను అధికారికంగా స్పష్టం చేశారు. ముందుగా ప్రకటించినట్లు ఈ చిత్రాన్ని ఆగస్టు 21న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయబోతున్నట్లు తెలుపుతూ ఒక సరికొత్త పోస్టర్‌ను విడుదల చేశారు.

సినిమా విడుదలకు ఇంకా 25 రోజులే ఉందంటూ విడుదల చేసిన ఈ పోస్టర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఇందులో రవితేజ, కూతురిగా నటిస్తున్న బేబీ నక్షత్రతో కలిసి పేకాట ఆడుతూ నవ్వులు చిందిస్తూ కనిపిస్తున్నాడు. శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఎమోషన్స్, ఆకట్టుకునే కుటుంబ కథాంశంతో సెంటిమెంట్‌ను పంచబోతోందని స్పష్టమవుతోంది.

ఇప్పటికే విడుదలైన ఫస్ట్ గ్లింప్స్, చార్ట్‌బస్టర్‌గా నిలిచిన ‘ఇరుముడి కట్టు’ అయ్యప్ప భక్తి పాటతో భారీ అంచనాలు నెలకొనగా, రాబోయే రోజుల్లో వరుస అప్‌డేట్స్‌ను అందించేందుకు చిత్రబృందం సిద్ధమవుతోంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై రూపొందుతున్న ఈ సినిమాలో ప్రియా భవానీ శంకర్ హీరోయిన్‌గా నటిస్తుండగా, జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతాన్ని అందిస్తున్నాడు.

The submit అఫీషియల్ : చెప్పిన తేదీకే వస్తున్న రవితేజ ‘ఇరుముడి’ first seemed on Newest Telugu Film Information, Opinions, OTT, OTT Opinions, Rankings.