Wed. Jul 29th, 2026

టాలెంటెడ్ యాక్టర్ సుమంత్, వెర్సటైల్ నటుడు జగపతి బాబు ప్రధాన పాత్రల్లో నటించిన క్రైమ్ థ్రిల్లర్ మూవీ ‘న్యూటన్స్ థర్డ్ లా’ (Newton’s third Regulation) ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ చేసింది. ఈ చిత్రాన్ని ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఈటీవీ విన్ వారు ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఇక ఈ చిత్రాన్ని జూలై 31న థియేటర్లలో గ్రాండ్ రిలీజ్‌కు రెడీ చేశారు.

ఈ సందర్భంగా చిత్ర బృందం ప్రేక్షకులకు గ్రాండ్ ఆఫర్ ప్రకటించింది. తెలంగాణలోని సంధ్య థియేటర్, పీవీఆర్, ఐనాక్స్ వంటి మెయిన్ థియేటర్లలో ఈ సినిమాను కేవలం రూ.105 కే వీక్షించే వెసులుబాటు కల్పించారు. ఈ సస్పెన్స్ థ్రిల్లర్‌కు సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ త్వరలోనే ప్రారంభం కానున్నాయని.. ప్రేక్షకులు ఈ ఆఫర్‌ను వినియోగించుకోవాలని చిత్ర యూనిట్ కోరింది.

రాజేష్ కర్ణ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాకు సింజిత్ యెర్రమిల్లి సంగీతం అందిస్తున్నాడు. ఇక ఈ సినిమాలోని కంటెంట్ ప్రేక్షకులను ఖచ్చితంగా ఆకట్టుకుంటుందని మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.

The submit ‘న్యూటన్స్ థర్డ్ లా’ అదిరిపోయే ఆఫర్.. కేవలం రూ.105 కే మూవీ టికెట్..! first gave the impression on Newest Telugu Film Information, Evaluations, OTT, OTT Evaluations, Rankings.