Wed. Jul 29th, 2026

నితీష్ తివారీ దర్శకత్వంలో రణ్‌బీర్ కపూర్, సాయి పల్లవి, యష్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న మైథలాజికల్ చిత్రం ‘రామాయణ’ విడుదలకు ముందే సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. ఆస్కార్ విజేతలు ఏఆర్ రెహమాన్, హన్స్ జిమ్మెర్ కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమా ఆల్ లాంగ్వేజ్ మ్యూజిక్ రైట్స్ కోసం సోనీ మ్యూజిక్ రూ.70 కోట్లు, టీ-సిరీస్ రూ.60 కోట్ల మేర బిడ్స్ వేయగా, నిర్మాత నమిత్ మల్హోత్రా మాత్రం రూ.100 కోట్లకు డీల్ ముగించాలని భావిస్తున్నారట.

ఇది వర్కవుట్ అయితే రణ్‌వీర్ సింగ్ ‘ధురంధర్: ది రివేంజ్’ పేరిట ఉన్న రూ.54 కోట్ల రికార్డు తుడిచిపెట్టుకుపోనుంది. ఇప్పటికే విదేశీ మార్కెటింగ్ కోసం సోనీ పిక్చర్స్‌తో కుదుర్చుకున్న ఒప్పందంతో పాటు మొత్తం గ్లోబల్ ప్రమోషన్స్ బడ్జెట్‌ను మేకర్స్ రూ.375 కోట్లకు పెంచారు. నాన్-థియేట్రికల్ హక్కుల ద్వారానే భారీగా రికవరీ చేయాలని భావిస్తున్నారు. రణ్‌బీర్, యష్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ భారీ విజువల్ వండర్ 2026 దివాళీ కానుకగా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.

The put up రామాయణ : రిలీజ్‌కు ముందే టార్గెట్.. ఎంతో తెలుసా..? first seemed on Newest Telugu Film Information, Opinions, OTT, OTT Opinions, Scores.