Wed. Jul 29th, 2026
Ramayana Promotion Budget: ప్రమోషన్స్ కోసం కళ్లు చెదిరే బడ్జెట్.. ప్రపంచాన్ని టార్గెట్ చేసిన రామాయణం!

భారతీయ చలనచిత్ర చరిత్రలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న అద్భుత దృశ్యకావ్యం ‘రామాయణ’ . రణ్‌బీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా నటిస్తున్న ఈ పాన్ ఇండియా చిత్రంలో యశ్, సన్నీ డియోల్, రవి దూబే వంటి దిగ్గజ నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.  నితీష్ తివారీ దర్శకత్వంలో నమిత్ మల్హోత్రా నిర్మిస్తున్న ఈ భారీ ప్రాజెక్ట్పై ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించి మేకర్స్ విడుదల చేసిన ఒక ప్రకటన సినీ వర్గాల్లో తీవ్ర సంచలనం సృష్టిస్తోంది.

సాధారణంగా సినిమాల ట్రైలర్‌లను సాయంత్రం లేదా రాత్రి సమయాల్లో విడుదల చేస్తుంటారు. కానీ, ఈసారి సంప్రదాయానికి భిన్నంగా సరికొత్త సంచలనానికి తెరతీశారు. అత్యంత పవిత్రమైన బ్రహ్మ ముహూర్త వేళ, గురువారం (జూలై 30) తెల్లవారుజామున సరిగ్గా 4:15 AM IST గంటలకు ఈ రామాయణ దృశ్యకావ్య ట్రైలర్‌ను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు.

హన్స్ జిమ్మర్, ఏ.ఆర్. రెహమాన్ వంటి సంగీత మాంత్రికులు ఈ ప్రాజెక్ట్‌కు పనిచేస్తుండటం విశేషం. ఐమ్యాక్స్ (IMAX) ఫార్మాట్‌లో అలరించనున్న ఈ విజువల్ వండర్ ట్రైలర్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తెల్లవారుజామున 4:15 గంటలకే రాబోతున్న ఈ ట్రైలర్ సోషల్ మీడియాలో ఎలాంటి సరికొత్త రికార్డులు సృష్టిస్తుందో వేచి చూడాలి!