Wed. Jul 29th, 2026

‘నారీ నారీ నడుమ మురారి’, ‘బైకర్’ చిత్రాలతో మంచి ఫామ్‌లోకి వచ్చిన శర్వానంద్, ప్రస్తుతం సంపత్ నంది దర్శకత్వంలో ‘భోగి’ అనే హై-వోల్టేజ్ మాస్ ఎంటర్‌టైనర్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఈ సినిమా రఫ్ కట్‌ను శర్వానంద్ వీక్షించాడట. ఫైనల్ అవుట్‌పుట్ చూసిన ఆయన సంతోషం వ్యక్తం చేశాడట.

అంతేగాక, సంపత్ నంది టేకింగ్ మరియు వర్క్ పట్ల శర్వా ఫుల్ హ్యాపీగా ఉన్నాడట. సంపత్ వర్కింగ్ స్టైల్‌కి బాగా ఇంప్రెస్ అయిన శర్వా, ‘భోగి’ విడుదలైన తర్వాత ఆయనతో మరొక సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడట. తాము కమిట్ అయిన ప్రాజెక్టులు పూర్తయ్యాక ఈ కాంబినేషన్ మళ్లీ పట్టాలెక్కనుంది.

కె.కె. రాధామోహన్ నిర్మాణంలో తెరకెక్కుతున్న ‘భోగి’ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్, డింపుల్ హయతి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని మొదట ఆగస్టు 28న విడుదల చేయాలని భావించినప్పటికీ, షూటింగ్ బ్యాలెన్స్ ఉండటంతో విడుదల తేదీని వాయిదా వేశారు. టాకీ పార్ట్ మరియు మిగిలిన చిత్రీకరణ పూర్తయిన తర్వాత కొత్త రిలీజ్ డేట్‌ను మేకర్స్ అధికారికంగా ప్రకటించనున్నారు.

The publish భోగి ఎఫెక్ట్… సంపత్ నందికి శర్వా మరో ఆఫర్..? first gave the impression on Newest Telugu Film Information, Opinions, OTT, OTT Opinions, Scores.