బాలీవుడ్ మోస్ట్ అవైటెడ్ బిగ్ బడ్జెట్ మూవీ ‘రామాయణ’ ట్రైలర్ ఇప్పటికే రిలీజ్ కావాల్సి ఉన్నా, కొన్ని కారణాల వల్ల అది వాయిదా పడింది. ఇక ఎప్పుడెప్పుడు ఈ ట్రైలర్ వస్తుందా అని ఎదురుచూస్తున్న ప్రేక్షకులు మేకర్స్ గుడ్ న్యూస్ చెప్పారు.
ఈ చిత్ర ట్రైలర్ విడుదలకు మేకర్స్ ముహూర్తం ఖరారు చేశారు. ఈ ప్రెస్టీజియస్ ట్రైలర్‌ను జూలై 30 తెల్లవారుజామున 4:15 గంటలకు రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఎంతో పవిత్రమైన బ్రహ్మ ముహూర్తంలో ఈ ట్రైలర్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నట్లు మేకర్స్ ఓ పోస్టర్ ద్వారా వెల్లడించారు. ఈ దివ్యమైన సమయాన్ని ఎంచుకోవడంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.
రణ్‌బీర్ కపూర్ రాముడిగా సాయి పల్లవి సీతగా, యష్ రావణుడిగా నటిస్తున్న ఈ ప్రెస్టీజియస్ చిత్రం కోసం సినీ ప్రియులు, అభిమానులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. జూలై 30న రాబోతున్న ఈ ట్రైలర్ ఎలాంటి విజువల్ వండర్‌ను ఆవిష్కరిస్తుందో చూడాలి.
The submit బ్రహ్మ ముహూర్తంలో ఎపిక్ ‘రామాయణ’ ట్రైలర్ ఫిక్స్.. ఎప్పుడంటే..? first seemed on Newest Telugu Film Information, Evaluations, OTT, OTT Evaluations, Scores.
