Wed. Jul 29th, 2026

ప్రపంచవ్యాప్తంగా సినీ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘స్పైడర్ మ్యాన్ : బ్రాండ్ న్యూ డే’ మూవీ ఎల్లుండి బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను తిరగరాసేలా కనిపిస్తోంది. సాధారణంగానే ఈ సిరీస్ చిత్రాలకు ఇండియాలో భారీ మార్కెట్ ఉంటుంది. కానీ ఈసారి అడ్వాన్స్ బుకింగ్స్ రెస్పాన్స్ చూసి ట్రేడ్ అనలిస్టులు సైతం బిత్తరపోతున్నారు.

హైదరాబాద్ అల్లు మల్టీప్లెక్స్‌తో పాటు ప్రధాన నగరాల్లోని ప్రముఖ థియేటర్లలో స్పెషల్ ప్రీమియర్ టికెట్ల కోసం పొలిటిషియన్ల రికమండేషన్లు చేస్తున్నా దొరకనంత డిమాండ్ ఏర్పడింది. ఈ అంచనాలను బట్టి చూస్తే, ఇండియాలో తొలిరోజే రూ.30 కోట్ల నుంచి రూ.50 కోట్లకు పైగా ఓపెనింగ్స్ నమోదు కావడం ఖాయంగా కనిపిస్తోంది.

మరోవైపు ఈ సాలీడు మనిషి జోరు చూసి ఇప్పటికే థియేటర్లలో ఉన్న ఇతర సినిమాల నిర్వాహకుల్లో టెన్షన్ మొదలైంది. ముఖ్యంగా క్లాస్ సెంటర్లలో మంచి టాక్‌తో రన్ అవుతున్న ‘చెన్నై లవ్ స్టోరీ’ చిత్రానికి ‘స్పైడర్ మ్యాన్’ నుంచి తీవ్రమైన పోటీ ఎదురయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. మాస్, క్లాస్ అనే భేదం లేకుండా సినీ ప్రేక్షకులంతా స్పైడర్ మ్యాన్ వైపే మొగ్గు చూపే అవకాశం ఉండటంతో, రన్నింగ్ చిత్రాల వసూళ్లపై ఈ ఇంపాక్ట్ ఎంతవరకు పడుతుందో వేచి చూడాలి.

The submit తెలుగు సినిమాలపై ‘స్పైడర్ మ్యాన్’ ఎఫెక్ట్.. ఏ రేంజ్‌లో ఉంటుందో చూడాలి..? first seemed on Newest Telugu Film Information, Opinions, OTT, OTT Opinions, Scores.