Wed. Jul 29th, 2026

మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్, టాలెంటెడ్ డైరెక్టర్ పవన్ సాధినేని కాంబినేషన్‌లో వస్తున్న ఫీల్ గుడ్ డ్రామా ‘ఆకాశంలో ఒక తార’. సాత్విక వీరవల్లి ఈ చిత్రంతో హీరోయిన్‌గా పరిచయమవుతోంది. కాగా దుల్కర్ సల్మాన్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ సాంగ్ ‘చిట్టి చిట్టి చీమ’ లిరికల్ వీడియోను మేకర్స్ తాజాగా రిలీజ్ చేశారు.

ఈ సినిమాలో హీరోయిన్ ఒక ఆస్ట్రోనాట్ కావాలని కలలు కంటుంది. ఆమె ఆశయాన్ని నెరవేర్చడానికి, నగర జీవితానికి అలవాటుపడుతూ పడే తపనకు హీరో తోడుగా నిలిచే నేపథ్యంలో ఈ పాట సాగుతుంది. శ్రీమణి అందించిన సాహిత్యం, జీవి ప్రకాష్ కుమార్ అందించిన స్వరాలు, రమ్య బెహరా ఆలపించిన తీరు శ్రోతలను ఆకట్టుకుంటున్నాయి. సుజిత్ సారంగ్ విజువల్స్ కూడా బాగున్నాయి.

గుణ్ణం గంగరాజు ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే అందిస్తుండగా, శృతి హాసన్ ఒక కీలక పాత్రలో నటిస్తోంది. లైట్ బాక్స్, స్వప్న సినిమాస్, వైజయంతీ మూవీస్ మరియు గీతా ఆర్ట్స్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్నారు.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

The submit మెలోడీ సాంగ్‌తో మ్యూజికల్ ట్రీట్ స్టార్ట్ చేసిన ‘ఆకాశంలో ఒక తార’ first seemed on Newest Telugu Film Information, Evaluations, OTT, OTT Evaluations, Scores.