Wed. Jul 29th, 2026

అక్కినేని యంగ్ హీరో అఖిల్ నటించిన లేటెస్ట్ మూవీ ‘లెనిన్’ ఇటీవల రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంది. మురళీ కిషోర్ అబ్బూరు డైరెక్ట్ చేసిన ఈ రూరల్ యాక్షన్ డ్రామాతో అఖిల్ తన కెరీర్‌లో తొలి బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకున్నాడు. ఇక ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి సాలిడ్ రెస్పాన్స్ రావడంతో ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర కళ్లు చెదిరే వసూళ్లు రాబట్టింది.

ఈ చిత్రం జూలై 10న రిలీజ్ కాగా, వరల్డ్‌వైడ్‌గా ఈ మూవీ 10 రోజుల్లో ఏకంగా రూ.88.8 కోట్ల మేర గ్రాస్ వసూళ్లు రాబట్టినట్లు మేకర్స్ అధికారికంగా వెల్లడించారు. అయితే, ఆ తర్వాత ఈ చిత్ర కలెక్షన్స్‌పై ఎలాంటి అప్డేట్స్ రాలేదు. దీంతో అక్కినేని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న లెనిన్ 100 కోట్ల మార్క్ సాధ్యమేనా అనే సందేహం నెలకొంది.

అయితే, నిర్మాత నాగవంశీ ఈ మూవీ సక్సెస్ మీట్‌లో ఈ చిత్రాన్ని అభిమానులు ఎలాగైనా వంద కోట్ల క్లబ్‌లోకి చేర్చాలని కోరారు. కానీ, బాక్సాఫీస్ దగ్గర కొత్త సినిమాలు వస్తుండటంతో ప్రేక్షకులు వాటివైపు మళ్లారు. మరి లెనిన్ ఈ వంద కోట్ల మార్క్‌ను అందుకుంటాడా లేడా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

The put up ‘లెనిన్’తో అఖిల్ అక్కినేని ఆ ఫీట్ సాధిస్తాడా..? first gave the impression on Newest Telugu Film Information, Evaluations, OTT, OTT Evaluations, Rankings.