Wed. Jul 29th, 2026

పాప్ కింగ్ మైఖేల్ జాక్సన్ జీవిత ఆధారంగా తెరకెక్కిన ‘మైఖేల్’ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 1.01 బిలియన్ డాలర్లు వసూలు చేసి, ఆల్‌టైమ్ అత్యధిక కలెక్షన్లు సాధించిన బయోపిక్‌గా చరిత్ర సృష్టించింది. మైఖేల్ మేనల్లుడు జాఫర్ జాక్సన్ ప్రధాన పాత్రలో జీవించగా, ఆంటోయిన్ ఫుక్వా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఆయన ‘జాక్సన్ 5’ రోజులతో పాటు సోలో కెరీర్ ప్రయాణాన్ని అద్భుతంగా ఆవిష్కరించింది.

థియేటర్లలో మిస్సయిన వారి కోసం ఈ లెజెండ్రీ మూవీ ఆగస్టు 29 నుంచి ‘జియో హాట్‌స్టార్’లోని పీకాక్ హబ్‌లో ఇంగ్లీష్, హిందీ ఆడియోల్లో స్ట్రీమింగ్‌కు రానుంది. ప్రైమ్ వీడియోలో రెంట్ పద్ధతిలో అందుబాటులో ఉన్నప్పటికీ, జియో హాట్‌స్టార్ సబ్‌స్క్రైబర్లు ఎలాంటి అదనపు రుసుము లేకుండా డిజిటల్ స్క్రీన్స్‌పై ఈ చిత్రాన్ని వీక్షించవచ్చు.

The put up ఓటీటీ డేట్ లాక్ చేసుకున్న ‘మైఖేల్’.. స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎందులో అంటే..? first seemed on Newest Telugu Film Information, Critiques, OTT, OTT Critiques, Scores.