మన టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోస్ లో ఒకరైన వెంకీ మామ హీరోగా శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్న అవైటెడ్ చిత్రమే ‘ఆదర్శ కుటుంబం’. అనౌన్స్మెంట్ తోనే మంచి బజ్ ని రేకెత్తించిన ఈ సినిమా అలా స్లోగానే షూటింగ్ పూర్తి చేసుకుంటుంది. అయితే సమ్మర్ రేస్ నుంచి ఈ సినిమా తప్పుకున్నట్టే అనుకోవాలి కానీ ఈ చిత్రంపై లేటెస్ట్ బజ్ ఒకటి వినిపిస్తుంది.
ఈ సినిమాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుంచి వచ్చిన పీరియాడిక్ డ్రామా హరిహర వీరమల్లు లో నటించిన తెలుగు బ్యూటీ పూజిత పొన్నాడ నటిస్తుంది అని తెలుస్తుంది. అలాగే ఆమె నటుడు నారా రోహిత్ కి జంటగా కనిపించనుంది అట. సో ఈ సినిమాలో ఆమె రోల్ ఎలా ఉంటుందో చూడాలి. ఇక ఈ చిత్రానికి హర్ష వర్ధన్ రామేశ్వర్ ని థమన్ రీప్లేస్ చేయగా హారికా హాసిని ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.
The put up ‘ఆదర్శ కుటుంబం’లో వీరమల్లు బ్యూటీ! first seemed on Newest Telugu Film Information, Opinions, OTT, OTT Opinions, Scores.
