వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఫీల్‌గుడ్ లవ్ ఎంటర్‌టైనర్ ‘దూరదర్శిని’ (కలిపింది ఇద్దరిని). సువిక్షిత్, గీతికా రతన్ జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి కార్తికేయ కొమ్మి దర్శకుడు. వారాహ మూవీ మేకర్స్ పతాకంపై జయ శంకర్ రెడ్డి.ఎం, పాటిమీది సంతోష్ నిర్మించిన ఈ సినిమా మే 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో బుధవారం హైదరాబాద్‌లో చిత్రబృందం ‘చిత్రలహరి మీట్’ పేరిట సమావేశం నిర్వహించింది.
ఈ సందర్భంగా హీరో సువిక్షిత్ మాట్లాడుతూ.. అరుణాచలంలో గిరి ప్రదక్షిణ చేస్తున్నప్పుడు కనిపించిన ఒక యాచకుడి నిజ జీవిత కథే ఈ సినిమా అని తెలిపారు. సొంత కొడుకు వల్లే ఆయనకు బిక్షాటన చేసే పరిస్థితి ఎందుకు వచ్చిందనే భావోద్వేగాల చుట్టూ కథ నడుస్తుందని వివరించారు. ప్రతి ఒక్కరినీ కంటతడి పెట్టించేలా ఈ సినిమా ఉంటుందని ఆయన నమ్మకం వ్యక్తం చేశారు.
దర్శకుడు కార్తికేయ, నటుడు జెమిని సురేష్ మాట్లాడుతూ.. ఇది కేవలం ప్రేమకథ మాత్రమే కాదని, 90వ దశకం నాటి జ్ఞాపకాలను, పల్లెటూరి వాతావరణాన్ని గుర్తుచేసే చిత్రమని చెప్పారు. గోదావరి నేపథ్యంలో సాగే ఈ చిత్రం ఈ వేసవిలో ప్రేక్షకులకు ఒక స్వచ్ఛమైన అనుభూతిని పంచుతుందని హీరోయిన్ గీతిక, లావణ్య రెడ్డి పేర్కొన్నారు.
The publish వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ‘దూరదర్శిని’.. మే 15న విడుదల first gave the impression on Newest Telugu Film Information, Critiques, OTT, OTT Critiques, Scores.
