దర్శకుడు శ్రీను వైట్ల – హీరో శర్వానంద్ కాంబినేషన్ లో ఓ సినిమా రాబోతుంది. ఈ సినిమాలో ‘మ్యాడ్’, ‘8 వసంతాలు’ ఫేమ్ అనంతిక సనీల్ కుమార్ హీరోయిన్ గా ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. ‘8 వసంతాలు’ సినిమాతో కుర్రకారు హృదయాలను కొల్లగొట్టేసింది ఈ బ్యూటీ. మరి శర్వానంద్ సరసన ఏ రేంజ్ లో ఆకట్టుకుంటుందో చూడాలి. మరోవైపు శర్వానంద్ ఇప్పటికే ఈ సినిమా కోసం తన లుక్ పై కసరత్తులు చేస్తోందని తెలుస్తోంది.
కాగా గోపీచంద్ హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ కామెడీ ‘విశ్వం’ ఏవరేజ్ గా నిలిచింది. దీంతో, ఎలాగైనా మళ్ళీ టాలీవుడ్ లో తన తర్వాత సినిమాతో బిజీ అయ్యేందుకు శ్రీనువైట్ల తెగ కష్ట పడుతున్నాడట. ఈ క్రమంలోనే శర్వాకి కథ చెప్పాడు. కాగా తెలియని వయసులో ఆవేశంలో చేసిన ఓ పని కారణంగా హీరో లైఫ్ లో జరిగే డ్రామా చాలా బాగుంటుందట. ఈ ఏడాది చివర్లో వీరిద్దరి కలయికలో సినిమా మొదలు అవుతుందట. ఈ సినిమాలో మరో సీనియర్ హీరో కూడా కనిపిస్తాడని తెలుస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మించనుంది.
The publish ఆ యంగ్ బ్యూటీతో ‘శర్వానంద్’ ? first seemed on Newest Telugu Film Information, Critiques, OTT, OTT Critiques, Scores.
