Sun. Jul 5th, 2026

విరాట్ కర్ణ హీరోగా అభిషేక్ నామా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఎపిక్ ఫాంటసీ అడ్వెంచర్ విజువల్ వండర్ ‘నాగబంధం – ది సీక్రెట్ ట్రెజర్’. నిక్ స్టూడియోస్ బ్యానర్‌పై కిషోర్ అన్నపురెడ్డి, నిశిత నాగిరెడ్డి ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఈ చిత్రంలో నభా నటేష్, ఐశ్వర్య మీనన్, జగపతిబాబు, మహేష్ మంజ్రేకర్, రిషభ్ సావ్నీ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. జూలై 3న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సందర్భంగా డైరెక్టర్ అభిషేక్ నామా విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు.

నాగబంధం ఆలోచన ఎప్పుడు వచ్చింది? మీ ఇన్‌స్పిరేషన్ ఏమిటి?

-పద్మనాభస్వామి ఆలయంలో వాల్ట్ బి ఎందుకు తెరవలేదనే విషయంలో చాలా చర్చలు జరిగాయి. దానిపై ఎన్నో కథలు ఉన్నాయి. ఆ గదిలోపల ఏముందనేది అందరికీ ఎంతో ఆసక్తికరం. నిజంగా ఆ గది తెరిస్తే అందులో ఏముంటుందో ఊహిస్తూ ఒక కథ చేస్తే బాగుంటుందని అనిపించింది. దాన్ని బ్యాక్‌డ్రాప్‌గా తీసుకుని ఒక ఫిక్షనల్ స్టోరీ చేయాలనిపించింది. అలా నాగబంధం కథను రాశాను.

అనంత పద్మనాభస్వామి ఆలయాన్ని సెట్ వేశారు కదా. ఆ అనుభవం గురించి చెప్పండి?

-మేము అనంత పద్మనాభస్వామి ఆలయానికి వెళ్లాము. అయితే అక్కడ ఫొటోలు తీసుకునేందుకు అనుమతి ఉండదు. అందుకే అక్కడ చూసిన వాటిని స్కెచ్‌ల రూపంలో పేపర్‌పై రూపొందించుకున్నాం. ఆ తర్వాత సినిమాటిక్ లిబర్టీ తీసుకుని, వేరే ఆర్కిటెక్చర్‌ను కూడా జోడించి ఆ సెట్‌ను డిజైన్ చేశాం.

విరాట్ కర్ణలాంటి కొత్త హీరోతో వంద కోట్లకు పైగా సినిమా చేయడం వెనుక కారణం?

-నిజానికి ఈ కథ మొదలుపెట్టినప్పుడు వంద కోట్ల బడ్జెట్ అవుతుందని అనుకోలేదు. కొత్త నటుడితో సినిమా చేయాలని అనుకున్నాను. ఎందుకంటే ఇది కథ మీద నడిచే సినిమా. పెద్ద హీరో ఉంటే కొన్ని అంచనాలు ఉంటాయి. అందుకే కొత్త హీరో అయిన విరాట్ కర్ణను ఎంపిక చేశాను.

నిర్మాతల గురించి?

-మా నిర్మాతలు మొదటి నుంచి కథను, నన్ను పూర్తిగా నమ్మి సినిమా కోసం ఖర్చు చేశారు. ఎలాంటి లెక్కలు వేసుకోకుండా కథకు ఏం అవసరమో అది అందించారు. ఈ విషయంలో వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు.ఫైనల్ అవుట్‌పుట్ విషయంలో చాలా హ్యాపీగా వున్నారు.

హిందీలో ఎలాంటి స్పందన ఉంది?

-బాలీవుడ్‌లో చాలా మంచి స్పందన వచ్చింది. దాదాపు 700కి పైగా స్క్రీన్లలో విడుదల అవుతోంది. తమిళంలో 200కి పైగా స్క్రీన్లలో విడుదల అవుతోంది. మొత్తంగా ప్రపంచవ్యాప్తంగా దాదాపు 2500కి పైగా స్క్రీన్లలో సినిమా విడుదల అవుతోంది. టీజర్, ట్రైలర్ విడుదలైన తర్వాత అన్ని బిజినెస్ డీల్స్ పూర్తయ్యాయి.

సంగీతం గురించి?

జునైద్, అభి కొత్తవారైనా చాలా అద్భుతమైన సంగీతం అందించారు. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా చాలా గ్రాండ్‌గా ఉంటుంది. పాటలన్నీ కమర్షియల్ ప్యాటర్న్‌లో ఉంటాయి.

The put up ఇంటర్వ్యూ : డైరెక్టర్ అభిషేక్ నామా – నాగబంధం ఒక గ్రేట్ విజువల్ ఫాంటసీ అడ్వెంచర్. first seemed on Newest Telugu Film Information, Critiques, OTT, OTT Critiques, Scores.