కొన్నాళ్ల కితం మన సౌత్ బిగ్ స్టార్స్ నుంచి బాక్సాఫీస్ దగ్గర క్లాష్ పడింది. మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన భోళా శంకర్ అలాగే సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన సినిమా జైలర్ క్లాష్ కి వచ్చాయి. అయితే చిరంజీవి చేసిన భోళా శంకర్ రీమేక్ కావడంతో ఆడియెన్స్ అంత ఆసక్తి చూపించకపోవడం వల్ల సినిమా ప్లాప్ అయ్యింది. రజిని లీడ్ తీసుకున్నారు.
కానీ ఈసారి మళ్లీ జైలర్ తోనే మెగాస్టార్ నెక్స్ట్ పోటీకి సిద్ధం అవుతుంది. జైలర్ 2 ని మేకర్స్ ఈ అక్టోబర్ 15కి లాక్ చేయగా మెగాస్టార్ నటించిన అవైటెడ్ సినిమా విశ్వంభర అక్టోబర్ 16కి లాక్ చేశారు. సో ఈసారి అయినా మెగాస్టార్ లెక్క సరి చేస్తారో లేదో అని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కొంచెం ఆలస్యం అయినా విశ్వంభర కోసం మెగా అభిమానులు ఎగ్జైటెడ్ గానే ఉన్నారు. ఈ ఈసారి ఎవరిది పైచేయి అవుతుందో చూడాల్సిందే.
The put up ఈసారి కూడా ‘జైలర్’ తోనే.. బాస్ లెక్క సరి చేస్తాడా! first seemed on Newest Telugu Film Information, Evaluations, OTT, OTT Evaluations, Scores.
