Sun. Jul 5th, 2026

​విరాట్ కర్ణ హీరోగా అభిషేక్ నామా దర్శకత్వంలో తెరకెక్కిన ఎపిక్ ఫాంటసీ అడ్వెంచర్ ‘నాగబంధం – ది సీక్రెట్ ట్రెజర్’. నిక్ స్టూడియోస్ బ్యానర్‌పై కిషోర్ అన్నపురెడ్డి, నిశిత నాగిరెడ్డి ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మించారు. నభా నటేష్, ఐశ్వర్య మీనన్, జగపతిబాబు కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రం జూలై 3న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ సందర్భంగా దర్శకుడు అభిషేక్ నామాతో మీడియాతో చిత్ర విశేషాలు పంచుకున్నారు.

​’నాగబంధం’ సినిమా ఐడియా అసలు ఎలా వచ్చింది?

పద్మనాభస్వామి ఆలయంలోని రహస్య గది (వాల్ట్ బి) చుట్టూ ఎన్నో కథలు ఉన్నాయి. నిజంగా ఆ గది తెరిస్తే లోపల ఏముంటుంది? అనే ఒక చిన్న ఊహ నుంచి పుట్టిన ఫిక్షనల్ ట్రెజర్ హంట్ స్టోరీనే ఈ ‘నాగబంధం’.

​ఇంత పెద్ద కథకు కొత్త హీరోను ఎందుకు తీసుకున్నారు?

ఈ సినిమాకు కథే హీరో. పెద్ద స్టార్ ఉంటే ఇమేజ్ బౌండరీలు, కమర్షియల్ అంచనాలు అడ్డు వస్తాయి. అందుకే కొత్త హీరో విరాట్ కర్ణను ఎంపిక చేశాం. నా విజన్‌ను నేనే పర్‌ఫెక్ట్‌గా ప్రెజెంట్ చేయాలనే ఉద్దేశంతో నేనే డైరెక్షన్ కూడా చేశాను. పక్కా ప్లానింగ్‌తో 107 రోజుల్లో షూటింగ్ పూర్తి చేశాం.

​సినిమా కోసం పద్మనాభస్వామి ఆలయం సెట్ వేశారు కదా.. ఆ ఎక్స్‌పీరియన్స్ ఏంటి?

మేము రియల్ టెంపుల్‌కి వెళ్ళాం కానీ అక్కడ ఫొటోలకి అనుమతి ఉండదు. అందుకే అక్కడ చూసిన విజువల్స్ ఆధారంగా స్కెచ్‌లు వేసుకుని, మరికొంత ఆర్కిటెక్చర్‌ను యాడ్ చేసి భారీ సెట్ డిజైన్ చేశాం. అయితే సినిమాలో మేము ఎక్కడా ఒరిజినల్ ఆలయం పేరు వాడలేదు. ఇదొక ఫిక్షనల్ టెంపుల్ బ్యాక్‌డ్రాప్ మాత్రమే.

​సినిమా బడ్జెట్ వంద కోట్లు దాటడానికి కారణం ఏంటి?

నిజానికి మొదట ఇంత బడ్జెట్ అనుకోలేదు. కానీ రియల్ లొకేషన్స్‌లో షూటింగ్‌కి పర్మిషన్స్ రాకపోవడంతో మొత్తం 8 భారీ సెట్లు వేయాల్సి వచ్చింది. ఆర్ట్ వర్క్, సీజీ (CG) వల్లే బడ్జెట్ పెరిగింది. ఇందులో 20 శాతం మాత్రమే రెమ్యూనరేషన్లకు వెళ్తే, మిగిలిన 80 శాతం ప్రొడక్షన్ ఖర్చులకే వెళ్ళింది. నిర్మాతలు ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సపోర్ట్ చేశారు.

​నటీనటుల పర్ఫార్మెన్స్ గురించి చెప్పండి?

నభా నటేష్ వేద విద్యార్థిని పాత్రలో చాలా బాగా నటించింది. ఇక విలన్ గరుడ రామ్ రోజు 20 కిలోల మేకప్ వేసుకుని, కనీసం అన్నం కూడా తినకుండా చాలా కష్టపడ్డారు. జగపతిబాబు గారు రాత్రి పూట నీళ్లలో సీన్స్ ఓపికగా చేశారు. హీరో విరాట్ చలికాలంలో నైట్ షూట్స్‌లో ఎలాంటి డూప్ లేకుండా యాక్షన్ సీన్స్ చేసి మెప్పించాడు.

​మ్యూజిక్ ఎలా ఉండబోతోంది? నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏంటి?

జునైద్, అభి బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాను నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్తుంది. ఇక ఈ కథకు సీక్వెల్ చేసే స్కోప్ చాలా ఉంది. అందుకే ఖచ్చితంగా ‘నాగబంధం 2’ చేసే ఆలోచన ఉంది.

The submit ఇంటర్వ్యూ: డైరెక్టర్ అభిషేక్ నామా – ‘నాగబంధం’ ఫ్యామిలీ అంతా ఎంజాయ్ చేసే విజువల్ వండర్! first gave the impression on Newest Telugu Film Information, Critiques, OTT, OTT Critiques, Rankings.