ఎస్.జి.ఎస్.వి మూవీస్ పతాకంపై బాలు చరణ్, కాజల్ తివారి జంటగా నటిస్తున్న సస్పెన్స్ యాక్షన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ “సుగ్రీవ”. నర్తు చిరంజీవి దర్శకత్వంలో ఎమ్. పవన్ కుమార్ నిర్మిస్తున్న ఈ చిత్ర ట్రైలర్‌ను తాజాగా సోషల్ మీడియాలో విడుదల చేశారు. నిర్మాణానంతర కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకున్న ఈ సినిమాను ఏప్రిల్ 24న రెండు తెలుగు రాష్ట్రాల్లో గ్రాండ్‌గా విడుదల చేయనున్నారు.
ఆనందంగా సాగిపోతున్న ఒక కుటుంబానికి అనుకోని సమస్యలు ఎదురైతే, వారు ఆ పరిస్థితులను ఎలా అధిగమించారనే ఆసక్తికరమైన కథాంశంతో ‘సుగ్రీవ’ రూపొందింది. ట్రైలర్ విడుదల సందర్భంగా చిత్ర యూనిట్ మాట్లాడుతూ.. నిర్మాత పవన్ కుమార్ ఎక్కడా రాజీ పడకుండా సినిమాను నిర్మించారని తెలిపారు. దర్శకుడు నర్తు చిరంజీవి టేకింగ్, యాక్షన్ ఎపిసోడ్స్ సినిమాకు హైలైట్‌గా నిలుస్తాయని చెప్పారు. అలాగే, గోవా, వైజాగ్ వంటి అందమైన లొకేషన్లలో పాటలను చిత్రీకరించినట్లు వెల్లడించారు.
సుమన్ శెట్టి, ఆర్ఎక్స్ 100 ఫేమ్ కరణ్ విజయ్, సాయి కృప తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి అజయ్ పట్నాయక్, విజయ్ కూరాకుల సంగీతం అందిస్తున్నారు. లక్కీ ఏకరీ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, సారధి స్టూడియోస్‌లో డీఐ (DI) పనులు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఏప్రిల్ 24న ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది.
The put up ఏప్రిల్ 24న ప్రేక్షకుల ముందుకు ‘సుగ్రీవ’.. ట్రైలర్ విడుదల first gave the impression on Newest Telugu Film Information, Opinions, OTT, OTT Opinions, Rankings.
