Tue. Apr 21st, 2026

మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా ‘ది బ్రేకింగ్ న్యూస్’ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ శుక్రవారం లాంచ్ అయింది. మీడియా నేపథ్యంతో ఆసక్తికరమైన థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో సీనియర్ నటుడు మురళీ మోహన్, అనన్య నాగళ్ల, వాసుదేవ్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఓపెన్ స్కై క్రియేషన్స్ బ్యానర్‌పై హనుమంత్ రెడ్డి, ఉమ గుటూర్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి పవన్ కడియాల రచన, దర్శకత్వం వహిస్తున్నారు.

ఫస్ట్ లుక్ విడుదల సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. “మురళీ మోహన్ గారిని ఇంత అగ్రెసివ్‌గా, ఆగ్రహభరితమైన పాత్రలో ఎప్పుడూ చూడలేదు. ఈ సినిమా చూసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను” అని ఆయన పేర్కొన్నారు. అలాగే అనన్య నాగళ్ల నటనను, దర్శకుడు పవన్ కడియాల పనితీరును చిరంజీవి ప్రత్యేకంగా ప్రశంసించారు.

శశి ప్రీతం సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి సాయినాథ్ సినిమాటోగ్రాఫర్‌గా, శిరీష్ ప్రసాద్ ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు. విభిన్నమైన కథాంశంతో తెరకెక్కుతున్న ఈ మీడియా థ్రిల్లర్‌ను 2026 మే నెలలో థియేటర్లలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. త్వరలోనే మరిన్ని వివరాలు వెల్లడించనున్నారు.

The publish ది బ్రేకింగ్ న్యూస్’ ఫస్ట్ లుక్ విడుదల చేసిన చిరంజీవి first gave the impression on Newest Telugu Film Information, Evaluations, OTT, OTT Evaluations, Scores.