ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ ఇటీవల భారతీయులు ఎంతో ఆరాదించే దైవం శ్రీరామునిపై అలానే రామాయణంపై పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. మరి ఈ కామెంట్స్ విషయంలో తనపై చాలా విమర్శలు వస్తున్నాయి. ఇక ఈ కామెంట్స్ పై మెగా బ్రదర్ నాగబాబు కూడా తన స్పందన అందించారు. ప్రకాష్ రాజ్ పేరు ఎక్కడా వాడకుండా తన సోషల్ మీడియాలో స్ట్రాంగ్ కౌంటర్ వేశారు.
“శ్రీరాముడు హిందువులకు కేవలం ఒక దైవం మాత్రమే కాదు, ఆయన ధర్మానికి నిలువెత్తు రూపం, సత్యం మరియు న్యాయానికి శాశ్వత జ్యోతి. ఆయన్ని అవమానించడం లేదా కించపరచడం సాహసం అనిపించుకోదు, అది అహంకారం మరియు పతనం నుండి పుట్టిన అజ్ఞానం మాత్రమే. రాముడిని ఎగతాళి చేసే వారు ఆయన్ని గాయపరచలేరు, తమను తాము గాయపరుచుకుంటారు.
ఎందుకంటే ధర్మం నాశనం లేనిది మరియు దాని రక్షకులు అజేయులు. ధర్మానికి వ్యతిరేకంగా నిలబడిన వారిని చరిత్రే అణచివేసింది, రాముడిపై విషం చిమ్మే వారి గతి కూడా అంతే. ఆయన నామం ఒక రక్షణ కవచం, ఆయన కథ ఒక ఖడ్గం, మరియు ఆయన ఉనికి మన నాగరికతకు చెక్కుచెదరని కోట.” అంటూ నాగబాబు పోస్ట్ చేసారు. అయితే నాగబాబు కూడా ప్రకాష్ రాజ్ లానే ఒక నాస్తికుణ్ణి అనే చెబుతారు. కానీ తన నుంచి ఈ తరహా కౌంటర్ రావడం ప్రకాష్ రాజ్ కి మరింత గట్టి రిప్లై అని రిప్లైలో ఫాలోవర్స్ అంటున్నారు.
The put up ప్రకాష్ రాజ్ వివాదాస్పద వ్యాఖ్యలపై నాగబాబు పరోక్షంగా స్ట్రాంగ్ కౌంటర్! first seemed on Newest Telugu Film Information, Opinions, OTT, OTT Opinions, Scores.
