Sun. Jul 5th, 2026

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించే భారీ హిట్ సినిమా ఓజి కోసం అందరికీ తెలిసిందే. దర్శకుడు సుజీత్ తెరకెక్కించిన ఈ క్రేజీ ప్రాజెక్ట్ కి ప్రీక్వెల్ గా ఓజి 2 ని ఇటీవల అనౌన్స్ చేసి ఫ్యాన్స్ కి సూపర్ కిక్ కూడా ఇచ్చారు. ఇక ఈ వరుస అప్డేట్స్ తర్వాత ప్రీక్వెల్ లో పవన్ సరసన బుట్టబొమ్మ పూజా హెగ్డే నటిస్తుంది అని వచ్చిన రూమర్స్ కి ఒకింత మిక్స్డ్ స్పందన వచ్చింది.

మెయిన్ గా దాదాపు ఫ్యాన్స్ అంతా ఈ టాక్ విషయంలో అసహనమే వ్యక్తం చేశారు. అయితే ఫైనల్ గా దీనిపై ఓ క్లారిటీ వినిపిస్తోంది. ఓజి ప్రీక్వెల్ లో పూజ హెగ్డే ఉంది అనే వార్తల్లో ఎలాంటి నిజం లేదని వినిపిస్తోంది. అంతే కాకుండా ఇతర నటీనటులు విషయంలో కూడా ఇంకా ఎలాంటి తుది నిర్ణయం తీసుకోలేదట. సో వీటి అన్నిటికీ క్లారిటీ కావాలంటే చాలా సమయమే పట్టొచ్చు. ఇక ఈ సినిమాకి థమన్ సంగీతం అందిస్తున్నాడు అలాగే పవన్ కళ్యాణ్ నిర్మాణం వహిస్తున్నారు.

The submit ‘ఓజి 2’లో ఆమె ప్రెజెన్స్ పై క్లారిటీ!? first seemed on Newest Telugu Film Information, Critiques, OTT, OTT Critiques, Rankings.