Tue. Apr 21st, 2026

రీసెంట్ గా కోలీవుడ్ సినిమా నుంచి వచ్చి భారీ సక్సెస్ సాధించిన చిన్న సినిమానే ‘యూత్’. యంగ్ అండ్ టాలెంటెడ్ నటుడు దర్శకుడు కెన్ కరుణాస్ నటించి తెరకెక్కించిన ఈ యూత్ ఫుల్ ఎంటర్టైనర్ రీసెంట్ గానే ఓటిటిలో ఎంట్రీ ఇచ్చింది. అయితే ఈ సినిమాపై తాజాగా బిగ్గెస్ట్ స్టార్ రిషబ్ శెట్టి స్పందించడం వైరల్ గా మారింది.

ఈ సినిమా చూసిన తర్వాత ఎంతో కాలంలో తర్వాత ఒక సినిమా చూస్తూ హాయిగా నవ్వుకుంటూ ఉన్నానని యూత్ సినిమా లవ్, ఫ్రెండ్షిప్ డీప్ ఎమోషన్స్ తో తనకి ఎంతగానో నచ్చింది అని రిషబ్ చెప్పడం ఈ సినిమాకి మరింత బూస్టప్ తెచ్చింది.

సింగిల్ హ్యాండెడ్ గా నటన, రచన దర్శకత్వం చేసిన కెన్ కరుణాస్ ఈ సినిమాకి మెయిన్ ఎసెట్ అని అలాగే ఇతర నటీనటులు జీవి ప్రకాష్ సంగీతం, ఫ్రెండ్స్ గ్యాంగ్ అంతా ఎంతో బాగా చేసి చూసేందుకు ఎంతో ఆనందాన్ని పంచారని రిషబ్ చెప్పడంతో తన పోస్ట్ ఈ సినిమా విషయంలో వైరల్ గా మారింది. మరి ఇంతలా ప్రశంసలు పొందిన ఈ సినిమా ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ లో ట్రెండ్ అవుతూ దూసుకెళ్తుంది.

The submit ‘కాంతార’ హీరోకి నచ్చిన బ్లాక్ బస్టర్ చిన్న సినిమా.. ఈ ఓటిటిలో first gave the impression on Newest Telugu Film Information, Critiques, OTT, OTT Critiques, Rankings.