నేషనల్ క్రష్ రష్మిక మందన్న, దీక్షిత్ శెట్టి హీరో హీరోయిన్లుగా నటుడు కమ్ డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్ రూపొందించిన లేటెస్ట్ చిత్రం ‘ది గర్ల్‌ఫ్రెండ్’. ఇప్పటికే ఈ సినిమా ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ చేసింది. నవంబర్ 7న గ్రాండ్ రిలీజ్‌కు రెడీ అవుతున్న ఈ సినిమా ప్రమోషన్స్ కూడా శరవేగంగా జరుగుతున్నాయి.
అయితే, ఈ సినిమా కోసం మేకర్స్ ఓ కాస్ట్లీ సాంగ్‌ను రూపొందించారు. ఈ చిత్ర నిర్మాత ధీరజ్ మొగిలినేని ఈ విషయానికి సంబంధించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలిపారు. ఈ సినిమాను ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లేందుకు ఓ ప్రమోషనల్ సాంగ్ చేద్దామని రాహుల్ రవీంద్రన్ చెప్పాడని.. దీని కోసం తమ టీమ్ ప్లాన్ చేయగా ఖర్చు ఏకంగా కోటి రూపాయలు అయ్యిందని ఆయన తెలిపాడు. అయితే, ముందుగా కమిట్ అయ్యామని ఆ పాటను కంప్లీట్ చేశామని ఆయన చెప్పుకొచ్చాడు.
కాగా, ఈ సాంగ్ కేవలం ప్రమోషనల్ సాంగ్ మాత్రమే అని.. సినిమాలో లేకపోవడం గమనార్హం. ఇక ఈ సినిమాలో రష్మిక, దీక్షిత్ మధ్య కెమిస్ట్రీ అందరినీ ఆకట్టుకోవడం ఖాయమని చిత్ర యూనిట్ చెబుతోంది.
The publish ‘గర్ల్‌ఫ్రెండ్’లో కాస్ట్లీ సాంగ్.. సినిమాలో మాత్రం ఉండదు..! first gave the impression on Newest Telugu Film Information, Opinions, OTT, OTT Opinions, Rankings.
