మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా ఇప్పుడు అనౌన్స్ అయ్యిన భారీ బడ్జెట్ పాన్ ఇండియా సినిమా గాడ్ ఆఫ్ వార్ కోసం పాన్ ఇండియా లెవెల్లో చర్చ నడుస్తోంది. అయితే ముఖ్యంగా మన దక్షిణాదిన తెలుగు ఆడియెన్స్ కంటే తమిళ ఆడియెన్స్ లో ఎక్కువ చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే మేకర్స్ పోస్ట్ లో కుమారస్వామిని ఉత్తర భారదేశానికి చెందిన భగవంతుడు దక్షిణాదిన పేరొందినట్టుగా పెట్టడం సడెన్ గా తమిళ ఆడియెన్స్ ని ట్రిగ్గర్ చేసినట్టు చెబుతున్నారు.
ఇంట్రెస్టింగ్ గా సోషల్ మీడియాలో ఎలాంటి డివోషనల్ సినిమాకి అంతగా సపోర్ట్ చేయని వారంతా కుమార స్వామి మా దేవుడు అంటూ ఎత్తుకోవడం హాట్ టాపిక్ గా మారింది. వారి వాదన ఏంటంటే ఉత్తరాది దేవుడు కాదు మా తమిళనాడు దేవుడు అంటూ రచ్చ చేస్తున్నారు. అయితే వారి అభిప్రాయంని ఎవరు తప్పు అని చెప్పట్లేదు కానీ మేకర్స్ చెప్పిన దానిలో కూడా నిజం ఉంది కదా అని ఇంకొందరు అంటున్నారు.
కుమారస్వామిని అత్యధికంగా తమిళ జనం ఆరాధించవచ్చు కానీ తన మూలాలు ఏంటి? కుమార స్వామిని మహాశివుడు కొడుకు అంటారు శివుడు ఉండే స్థానం హిమాలయాలు. సో కుమార స్వామి అక్కడ నుంచి వచ్చినట్టే కదా అని తెలుగు సహా ఇతర ఆడియెన్స్ వాదన. ఇంట్రెస్టింగ్ గా కోలీవుడ్ ఆడియెన్స్ ఇంత చిన్న లాజిక్ ఎలా మర్చిపోయారు అనే టాక్ ఇప్పుడు వినిపిస్తోంది.
The put up గాడ్ ఆఫ్ వార్’.. కోలీవుడ్ ఆడియెన్స్ ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్సయ్యారు? first gave the impression on Newest Telugu Film Information, Critiques, OTT, OTT Critiques, Rankings.
