విక్టరీ వెంకటేష్, సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో ఐదోసారి ఒక క్రేజీ ప్రాజెక్ట్ తెరకెక్కుతోంది. పూర్తి స్థాయి వినోదాత్మక చిత్రంగా రూపొందుతున్న ఈ సినిమా ఈ నెలలోనే ఘనంగా ప్రారంభమైంది. జూన్ 22 నుండి మోకిలలో ఈ సినిమా షూటింగ్ కూడా మొదలైంది. ప్రస్తుతం వెంకటేష్ లేకుండానే అనిల్ రావిపూడి అండ్ టీమ్ కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. మొదటి రోజు నుంచే కళ్యాణ్‌రామ్, కృతి శెట్టి షూటింగ్‌లో జాయిన్ అయ్యారు. కాగా, సీనియర్ హీరో వెంకటేష్ జూలై 2 నుండి ఈ సెట్స్‌లోకి అడుగుపెట్టనున్నాడు.
దీని కోసం ఒక భారీ షెడ్యూల్‌ను ప్లాన్ చేశారు. ప్రస్తుతం వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’ సినిమా షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు. అయినప్పటికీ అనిల్ రావిపూడి సినిమాలోని కొన్ని కీలక భాగాలను పూర్తి చేయడం కోసం ఆయన డేట్స్ కేటాయించాడు. ఈ కొత్త షెడ్యూల్‌లోనే కీర్తి సురేష్ కూడా చిత్రబృందంతో కలవనుంది. నవంబర్ మధ్య నాటికల్లా ఈ సినిమా షూటింగ్ మొత్తాన్ని పూర్తి చేయాలని అనిల్ రావిపూడి ప్లాన్ చేస్తున్నాడు.
ఈ చిత్రాన్ని సంక్రాంతి 2027 కానుకగా విడుదల చేయాలని మేకర్స్ లక్ష్యంగా పెట్టుకున్నారు. జి.వి. ప్రకాష్ కుమార్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా, సాహు గారపాటి నిర్మాణ బాధ్యతలు చేపట్టారు. జీ స్టూడియోస్, సురేష్ ప్రొడక్షన్స్ సంస్థలు సంయుక్తంగా ఈ హిలేరియస్ ఎంటర్‌టైనర్‌ను సమర్పిస్తున్నాయి.
The put up అనిల్ రావిపూడి సినిమాలో వెంకీ జాయిన్ అయ్యేది ఎప్పుడంటే..? first gave the impression on Newest Telugu Film Information, Critiques, OTT, OTT Critiques, Rankings.
