స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ డ్రీమ్ ప్రాజెక్ట్ ‘గాడ్ ఆఫ్ వార్’ హీరోగా ఎన్టీఆర్ పేరు అధికారికంగా ప్రకటించడంతో, గత కొన్ని రోజులుగా నడుస్తున్న రూమర్లకు తెరపడింది. ఈ చిత్రంలో ఎన్టీఆర్ స్థానంలో అల్లు అర్జున్ నటిస్తున్నాడంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఫ్యాన్ వార్స్ జరిగాయి. అయితే, వచ్చే ఏడాది ప్రారంభం కానున్న ఈ భారీ మైథలాజికల్ ప్రాజెక్ట్ నుండి అల్లు అర్జున్ ఎందుకు తప్పుకున్నాడనే దానికి అసలు కారణాలు బయటకు వచ్చాయి.
నిజానికి, త్రివిక్రమ్ ఈ కథను కేవలం ఎన్టీఆర్‌ను మాత్రమే మనసులో పెట్టుకుని రాసుకున్నాడట. అయితే గత ఏడాది బన్నీ చేతిలో అట్లీ సినిమా తప్ప మరే ప్రాజెక్ట్ లేని సమయంలో, ఆయనే స్వయంగా త్రివిక్రమ్‌ను కలిసి ఈ సినిమా తనతో చేయమని అడిగాడని తెలుస్తోంది. అప్పుడు త్రివిక్రమ్, ఎన్టీఆర్ ఇద్దరూ సైలెంట్‌గా ఉన్నారని.. ఈ లోపు అల్లు అర్జున్ అనూహ్యంగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో మరో సినిమాను ఓకే చేసి అనౌన్స్ చేశాడని తెలుస్తోంది.
బన్నీ మరో ప్రాజెక్ట్ వైపు వెళ్లడంతో, త్రివిక్రమ్ సరైన సమయం చూసి ఎన్టీఆర్‌తో ఈ సినిమాను అధికారికంగా ప్రకటించాడు. అంటే, బన్నీని ఎవరూ తొలగించలేదని.. ఆయనే స్వయంగా ప్రాజెక్ట్ అడిగి, ఆ తర్వాత మరో సినిమాను లైన్ లో పెట్టుకుని ముందుకు సాగాడని సినీ సర్కిల్స్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. ఫైనల్‌గా త్రివిక్రమ్ తాను మొదటి నుండి అనుకున్న హీరో ఎన్టీఆర్‌తోనే ఈ భారీ పాన్-ఇండియా విజువల్ వండర్‌ను పట్టాలెక్కిస్తున్నాడు.
The submit ‘గాడ్ ఆఫ్ వార్’ నుంచి బన్నీ ఎందుకు తప్పుకున్నాడో తెలుసా..? first gave the impression on Newest Telugu Film Information, Opinions, OTT, OTT Opinions, Rankings.
