2027 సంక్రాంతి బాక్సాఫీస్ రేసులోకి మాస్ మహారాజా రవితేజ, శ్రీవిష్ణు క్రేజీ మల్టీస్టారర్ వచ్చి చేరింది. ‘రాజ రాజ చోర’, ‘స్వాగ్’ చిత్రాల దర్శకుడు హసిత్ గోలి తెరకెక్కిస్తున్న ఈ సినిమా అవుట్ అండ్ అవుట్ హిలేరియస్ ఎంటర్‌టైనర్‌గా రూపొందనుంది. కామెడీ టైమింగ్‌లో దిట్టలైన రవితేజ, శ్రీవిష్ణు కలిసి నటిస్తుండటంతో ఈ ప్రాజెక్ట్‌పై అప్పుడే అంచనాలు పెరిగాయి.
ఈ చిత్రాన్ని స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు తన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ సినిమాను సంక్రాంతి కానుకగా విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
ఇప్పటికే 2027 పండగ బరిలో చిరంజీవి-బాబీ సినిమా, అనిల్ రావిపూడి మల్టీస్టారర్ మరియు ‘కింగ్ 100’ వంటి భారీ చిత్రాలు ఉన్నాయి. ఇప్పుడు రవితేజ-శ్రీవిష్ణు సినిమా కూడా తోడవ్వడంతో వచ్చే సంక్రాంతి బాక్సాఫీస్ వద్ద పండగ పోటీ అత్యంత రసవత్తరంగా మారనుంది.
The submit క్రేజీ బజ్.. వచ్చే సంక్రాంతికి సాలిడ్ మల్టీస్టారర్‌తో మాస్ రాజా ఎంట్రీ? first gave the impression on Newest Telugu Film Information, Critiques, OTT, OTT Critiques, Scores.
