Wed. Apr 22nd, 2026

ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ కుటుంబం ఇటీవ‌ల ఆయన త‌ల్లి కనకరత్నం(అల్లు అర్జున్, అల్లు శిరీష్‌ల నానమ్మ) మృతితో తీవ్ర విషాదాన్ని అనుభవించింది. ఆ విషాదం నుంచి అభిమానులు ఇంకా కోలుకోకముందే, ఆ ఇంటి నుంచి ఓ శుభవార్త వినిపిస్తోంది.

యాక్టర్ అల్లు శిరీష్ త్వరలోనే తన నిశ్చితార్థాన్ని నయనికతో అధికారికంగా ప్రకటించారు. తమ నిశ్చితార్థం అక్టోబర్ 31న జరగనుందని శిరీష్ తెలిపారు. తన తాతగారు అల్లు రామలింగయ్య జయంతి రోజున ఈ వార్తను పంచుకోవడం సంతోషంగా ఉందని శిరీష్ ప్రకటించాడు. శిరీష్, నయనిక చేతులు పట్టుకున్న ఫోటోను ఆయన సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ ఫోటోను పారిస్‌లో క్లిక్ చేసినట్లు తెలుస్తోంది.

ఈ హ్యాపీ న్యూస్‌పై సినీ ప్రముఖులు, స్నేహితులు, అభిమానులు శిరీష్‌ను అభినందిస్తున్నారు. నిశ్చితార్థ మరియు పెళ్లి వివరాలు త్వరలోనే వెల్లడయ్యే అవకాశం ఉంది.

The submit గుడ్ న్యూస్ చెప్పిన అల్లు శిరీష్..! first gave the impression on Newest Telugu Film Information, Evaluations, OTT, OTT Evaluations, Rankings.