Tue. Apr 21st, 2026

ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి అభిమానులు ఎంతో ఎగ్జైటెడ్ గా ఎదురు చూస్తున్న లేటెస్ట్ సినిమానే తన 158వ సినిమా అని చెప్పాలి. బ్లాక్ బస్టర్ హిట్ చిత్రం వాల్తేరు వీరయ్య అందించిన దర్శకుడు బాబీ కొల్లితో మరోసారి మెగాస్టార్ సినిమా అనౌన్స్ చేయడంతో ఈ సినిమాపై మంచి హైప్ నెలకొంది.

అలాగే డాకు మహారాజ్ లాంటి సాలిడ్ వర్క్ బాబీ నుంచి పడేసరికి మెగాస్టార్ తో కనుక ఆ తరహా సినిమా చేస్తే అది నెక్స్ట్ లెవెల్లో బాక్సాఫీస్ దగ్గర వర్క్ అవుతుంది అని అభిమానులు మరింత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కానీ ఈ సినిమా ఇంకా మొదలు కాకపోవడం మాత్రం వారిని ఒకింత డిజప్పాయింట్ చేస్తుంది.

నిజానికి ఈ ఏప్రిల్ లోనే సినిమా ముహూర్త కార్యక్రమంతో మొదలు కావాల్సి ఉంది కానీ ఇదే సినిమా నిర్మాణ సంస్థ చేసిన జన నాయగన్ లీక్ కారణంగా తాత్కాలికంగా వాయిదా వేశారు. మరి ఈ గ్యాప్ లో అభిమానులో మరింత టెన్షన్ నెలకొంది.

ఈ సినిమా త్వరగా స్టార్ట్ చేయాలని వారు కోరుకుంటున్నారు. మరి మేకర్స్ జన నాయగన్ టెన్షన్ లోనే ఎక్కువ కనిపిస్తున్నారు. మొదట ఆ సినిమా విడుదల చేస్తే తప్ప ఏదీ ఒక కొలిక్కి వచ్చేలా కనిపించడం లేదు. సో మెగా 158 ఎప్పుడు మొదలవుతుందో చూడాలి మరి.

The publish ‘జన నాయగన్’ వస్తే గానీ ‘మెగా 158’ మొదలు కాదా? first seemed on Newest Telugu Film Information, Evaluations, OTT, OTT Evaluations, Scores.