Sun. Jul 5th, 2026

కన్నడ రాకింగ్ స్టార్ యష్ హీరోగా నటించిన లేటెస్ట్ అవైటెడ్ సినిమా టాక్సిక్ కోసం అందరికీ తెలిసిందే. భారీ బడ్జెట్ తో దర్శకురాలు గీతూ మోహన్ దాస్ తెరకెక్కించిన ఈ సెన్సేషనల్ ప్రాజెక్ట్ విడుదల కోసం అభిమానులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ సినిమా నుంచి లేడీ గ్యాంగ్ ని ఇవాళ పరిచయం చేస్తున్నట్లు ఆల్రెడీ కన్ఫర్మ్ చేయగా ఇప్పుడు ఆ టీజర్ కట్ ని విడుదల చేసారు.

అయితే ఈ కట్ మాత్రం మాస్ ఆడియెన్స్ కి, యష్ ఫ్యాన్స్ కి ఫీస్ట్ ఇచ్చేలా ఉందని చెప్పొచ్చు. హీరోయిన్స్ కీయారా అద్వానీ, నయనతార, రుక్మిణి వసంత్ అలానే తారా సుతారియా ఇంకా హుమా ఖురేషి లలో కీయారా మినహా మిగతా అందరి నుంచి గ్లామర్ తో పాటుగా యాక్షన్ ఎలిమెంట్స్ కూడా గట్టిగానే పెట్టినట్టు కనిపిస్తుంది.

అంతే కాకుండా యష్ పై లేడీ గ్యాంగ్ తో డిజైన్ చేసిన డైలాగ్స్, యాక్షన్ సీక్వెన్స్ లు ఇందులో రవి బసృర్ సంగీతం కూడా ఇంప్రెస్ చేసే విధంగా ఉన్నాయి. సో మొత్తానికి పాన్ ఇండియా ఆడియెన్స్ కి అపీల్ అయ్యే విధమైన కంటెంట్ తో యష్ మరోసారి రాబోతున్నాడు అని చెప్పొచ్చు. ఇక ఇది బిగ్ స్క్రీన్స్ పై ఎలా ఉంటుందో చూడాల్సిందే. అది తెలియాలి అంటే ఈ ఆగస్ట్ 28 వరకు ఆగాల్సిందే.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

The publish టీజర్ టాక్: ‘టాక్సిక్’ లేడీ గ్యాంగ్.. గ్లామర్ తో పాటు యాక్షన్ కూడా! first seemed on Newest Telugu Film Information, Critiques, OTT, OTT Critiques, Rankings.