ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన మొట్టమొదటి తెలుగు ఒరిజినల్ సిరీస్ ‘సూపర్ సుబ్బు’ ట్రైలర్‌ను మేకర్స్ తాజాగా రిలీజ్ చేశారు. సందీప్ కిషన్ ప్రధాన పాత్రలో, ‘డీజే టిల్లు’ ఫేమ్ మల్లిక్ రామ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ కామెడీ డ్రామా సిరీస్ జూలై 2న పలు భాషల్లో విడుదల కానుంది. చిలకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాజీవ్ చిలక, భరత్ లక్ష్మీపతి సంయుక్తంగా ఈ సిరీస్‌ను నిర్మించారు.
ఇక ఈ ట్రైలర్ చూస్తుంటే.. ప్రభుత్వ పాఠశాలలో పర్మనెంట్ ఉద్యోగం కోసం ప్రయత్నించే సుబ్బు ఊహించని విధంగా దేశ సగటు కంటే ఎక్కువ సంతానోత్పత్తి రేటు ఉన్న మాకిపూర్ అనే గ్రామానికి సెక్స్ ఎడ్యుకేషన్ టీచర్‌గా వెళ్లాల్సి వస్తుంది. అక్కడ గ్రామస్తులకు జనాభా నియంత్రణపై అవగాహన కల్పించే క్రమంలో సుబ్బు ఎలాంటి సవాళ్లను ఎదుర్కొన్నాడు.. అక్కడి మగాళ్ల ఆగ్రహానికి ఎలా గురయ్యాడు అనేదే ఈ సిరీస్ కథగా ఉండబోతుందని తెలుస్తోంది. గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ కథలో వినోదంతో పాటు ఒక మంచి సామాజిక సందేశం కూడా ఉన్నట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది.
వైవిధ్యమైన పాత్రలో సందీప్ కిషన్ నటన, రిఫ్రెషింగ్ కాన్సెప్ట్ ఈ సిరీస్‌కు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. ఈ షోలో మిథిలా పాల్కర్, బ్రహ్మానందం, సంపూర్ణేష్ బాబు, హైపర్ ఆది, గెటప్ శ్రీను, మానస చౌదరి, రఘుబాబు తదితరులు కీలక పాత్రలు పోషించారు. మరి ఈ సిరీస్ ప్రేక్షకులను ఎంతమేర ఆకట్టుకుంటుందో చూడాలి.
వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి
The put up ట్రైలర్ టాక్ : సెక్స్ పాఠాల కోసం ‘సూపర్ సుబ్బు’ కష్టాలు..! first seemed on Newest Telugu Film Information, Evaluations, OTT, OTT Evaluations, Scores.
