రాకింగ్ స్టార్ మంచు మనోజ్ హీరోగా తెరకెక్కుతున్న పీరియాడికల్ యాక్షన్ మూవీ ‘డేవిడ్ రెడ్డి’. హనుమరెడ్డి యక్కంటి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా పై లేటెస్ట్ అప్ డేట్ వినిపిస్తోంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ లో ఉన్న ఈ సినిమా కోసం మొదటి నాలుగు నిమిషాలు పాటు 3డి క్యారెక్టర్స్ తో పీరియాడిక్ కథకు సంబంధించిన క్యారెక్టర్స్ ను అండ్ లీడ్స్ ను ఆ 3డి విజువల్స్ మీద వాయిస్ ఓవర్ లో చెబుతారట. ఇక ఈ సినిమా కోసం మనోజ్ భారీ యాక్షన్ సీన్స్ ను షూట్ చేయనున్నారు. మరోవైపు టీమ్ ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ను శరవేగంగా పూర్తి చేసే పనిలో ఉంది.
ఇక ‘డేవిడ్ రెడ్డి’ కథ విషయానికొస్తే.. స్వాతంత్రానికి పూర్వం జరిగిన కథ ఇది. బ్రిటిష్ వారిపై పోరాడిన ‘డేవిడ్ రెడ్డి’ అనే యోధుడి కథగా రానున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా కోసం ‘వార్ డాగ్’ అనే బైక్‌ను రూపొందించారు. దాని బరువు దాదాపు 700 కేజీలు. సినిమాలో అది ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. అన్నట్టు ఈ సినిమాలో మనోజ్ సరసన ‘ప్రిన్స్’ (కోలీవుడ్ మూవీ) హీరోయిన్ మరియా నటించబోతుంది. .
The put up మనోజ్ ‘డేవిడ్ రెడ్డి’ లేటెస్ట్ అప్ డేట్ ! first gave the impression on Newest Telugu Film Information, Opinions, OTT, OTT Opinions, Scores.
