Tue. Apr 21st, 2026

బాలీవుడ్ స్టార్ అండ్ టాలెంటెడ్ హీరో రణ్వీర్ సింగ్ హీరోగా సారా అర్జున్ హీరోయిన్ గా దర్శకుడు ఆదిత్య ధర్ తెరకెక్కించిన సెన్సేషనల్ సీక్వెల్ సినిమానే ధురంధర్ 2. సాలిడ్ స్పై ఏక్షన్ సినిమాగా దీనిని ప్లాన్ చేయగా చాలా మంది ఈ పార్ట్ 2 సినిమా సరికొత్త రికార్డులు సెట్ చేస్తుంది అని భావించారు. అలా అంచనాలుకి తగ్గట్టు గానే పార్ట్ 2 కి బంపర్ ఓపెనింగ్స్ కూడా పడ్డాయి. కానీ ఈపాటికే వరల్డ్ వైడ్ అన్ని రికార్డులు ఈ సినిమా తుడిచేస్తుంది అని భావించారు.

అదే విధంగా 2000 కోట్ల గ్రాస్ క్లబ్ లో ఈ సినిమా చేరుతుంది అని భావించారు. కానీ ఇప్పుడు సినిమా స్టడీగానే ఉంది కాని ఫైనల్ రన్ లో 2000 కోట్ల మార్క్ అందుకోవడం అంటే ఒకింత కష్టం అనే అనుకోవాలి. పార్ట్ 1 దెబ్బకి పార్ట్ 2 ఈ పాటికే సెన్సేషనల్ రికార్డులు కొడుతోంది అని అంతా భావించారు కానీ ఇది నెమ్మదించింది. సో ధురంధర్ 2 ఆ 2 వేల కోట్ల మార్క్ అందుకుంటుందో లేదో చూడాలి.

The submit ధురంధర్ 2.. ఈ మార్క్ అందుకోడం కష్టమేనా! first gave the impression on Newest Telugu Film Information, Critiques, OTT, OTT Critiques, Rankings.