Tue. Apr 21st, 2026

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ప్రస్తుతం దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తన నెక్స్ట్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్ర షూటింగ్ ఎప్పుడో మొదలైంది. అయితే, ‘వార్-2’ కోసం ఎన్టీఆర్ బల్క్ డేట్స్ కేటాయించడంతో ఈ మూవీ ఆలస్యం అవుతూ వచ్చింది. అయితే, ‘వార్-2’ రిలీజ్ అయ్యి ఫ్లాప్‌గా మిగలడంతో ఇప్పుడు ఎన్టీఆర్ తన ఫోకస్ మొత్తం నీల్ మూవీపైకి షిఫ్ట్ చేశాడు.

ఇటీవల ఈ చిత్ర షూటింగ్ ఔట్‌పుట్ సరిగా రావడం లేదని.. దీంతో తీసిన ఫుటేజీ మొత్తాన్ని రీ-షూట్ చేస్తున్నట్లు సినీ వర్గాల్లో రూమర్స్ వినిపించాయి. కానీ, అందులో వాస్తవం లేదని.. కొంతవరకు రీ-షూట్ చేసిన మాట వాస్తవమే అయినా, పూర్తిగా రీషూట్ చేయలేదని చిత్ర వర్గాల టాక్. ఇక ఇప్పుడు ఎన్టీఆర్ ఈ చిత్ర సెట్స్‌లో జాయిన్ అయ్యాడని.. ఇకపై సినిమా షూటింగ్‌కు ఎలాంటి బ్రేక్ లేకుండా తారక్ ప్లాన్ చేస్తున్నాడట.

పక్కా మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న ఈ సినిమాలో రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా నటిస్తుండగా మైత్రీ మూవీ మేకర్స్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ చిత్రానికి ‘డ్రాగన్’ అనే టైటిల్ ఫిక్స్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు.

The publish నీల్ కోసం ఇక ఎన్టీఆర్ నో బ్రేక్..? first gave the impression on Newest Telugu Film Information, Opinions, OTT, OTT Opinions, Rankings.