గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘పెద్ది’. ఈ సినిమా పై పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాలు ఉన్నాయి. పెద్ది నుండి మొదటి సింగిల్‌ను ఏఆర్ రెహమాన్, నవంబర్ 8, 2025న హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో తన ప్రత్యక్ష సంగీత కచేరీలో ప్రదర్శించనున్న విషయం ఇప్పటికే తెలిసిందే. ఐతే, తాజా వార్తల ప్రకారం, ప్రత్యక్ష ప్రదర్శనకు ముందు, నవంబర్ 6, 2025న ఈ పాట డిజిటల్‌గా విడుదల కానుంది.
కాగా, ఇప్పటి వరకూ చరణ్ నుంచి వచ్చిన అన్ని చిత్రాల కంటే.. ఈ సినిమా చాలా భిన్నంగా ఉండబోతుందని టాక్. మొత్తానికి బుచ్చిబాబు రాసిన ఈ సినిమా స్క్రిప్ట్ చాలా భిన్నమైందట. అన్నట్టు ‘పెద్ది’ వచ్చే ఏడాది మార్చి 27న రిలీజ్ కానుంది. జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో శివ రాజ్‌కుమార్, జగపతి బాబు, దివ్యేంద్రు శర్మ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. మరి పెద్ది సినిమా ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో చూడాలి. రెహమాన్ ఈ చిత్రానికి స్వరాలు అందిస్తున్నారు.
The submit పెద్ది మొదట సింగిల్ రిలీజ్ ఆ రోజే ? first seemed on Newest Telugu Film Information, Critiques, OTT, OTT Critiques, Scores.
