Wed. Apr 22nd, 2026

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లేటెస్ట్ సినిమా ‘పెద్ది’ ఏప్రిల్ 30న విడుదల కావడం లేదని దాదాపు ఖరారైంది. ప్రస్తుతం ఒక స్పెషల్ సాంగ్ షూటింగ్ పెండింగ్‌లో ఉంది. సెట్ సిద్ధమైనప్పటికీ, ఇంకా హీరోయిన్ ఫిక్స్ కాకపోవడం తో షూటింగ్ వచ్చే వారానికి వాయిదా పడింది.

​ప్రస్తుతం రామ్ చరణ్ అనంత్ అంబానీ పుట్టినరోజు వేడుకల కోసం జామ్‌నగర్ వెళ్లాడు. ఆయన తిరిగి వచ్చేలోపు పాట కోసం హీరోయిన్‌ను ఫైనల్ చేయాలని టీమ్‌ను కోరాడు. మరోవైపు దర్శకుడు బుచ్చిబాబు చెన్నైలో ఏఆర్ రెహమాన్‌తో కలిసి సినిమా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ పనుల్లో బిజీగా ఉన్నాడు.

​సినిమా నిర్మాత వెంకట సతీష్ కిలారు ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్ ప్రతినిధులతో కొత్త విడుదల తేదీ గురించి చర్చిస్తున్నారు. షూటింగ్ అప్‌డేట్స్ మరియు కొత్త రిలీజ్ డేట్‌పై ఈ వీకెండ్ లోగా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

The submit ‘పెద్ది’ స్పెషల్ కూడా వెనక్కి.. కారణం ఇదేనా..? first gave the impression on Newest Telugu Film Information, Evaluations, OTT, OTT Evaluations, Scores.