‘హనుమాన్’ చిత్రంతో తన ట్యాలెంట్ ప్రూవ్ చేసుకుని బాక్సాఫీస్ దగ్గర సరికొత్త రికార్డు క్రియేట్ చేసిన డైరెక్టర్ ప్రశాంత్ వర్మ, ప్రస్తుతం వరుస ప్రాజెక్టులను లైన్‌లో పెడుతున్నాడు. హనుమాన్ చిత్రానికి సీక్వెల్‌గా ‘జై హనుమాన్’ చిత్రాన్ని ఇప్పటికే ఆయన ప్రారంభించాడు. ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ చక్కర్లు కొడుతుంది.
ఈ సినిమాలో రిషబ్ శెట్టి హనుమంతుడి పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు ఈ సినిమాలో మరో కీలక పాత్ర అశ్వద్ధామను నటుడు రానా దగ్గుబాటి పోషించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ పాత్రతో రానా కూడా చాలా రోజుల తర్వాత ఓ పవర్‌ప్యాక్డ్ పర్ఫార్మెన్స్ ఇవ్వబోతున్నట్లు చిత్ర వర్గాల టాక్.
ఈ సినిమాలో తన పాత్రతో రానా మరోసారి పాన్ ఇండియా రేంజ్‌లో తన సత్తా చాటడం ఖాయమని తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో తేజ సజ్జా మరోసారి హీరోగా నటిస్తుండగా, ఇప్పుడు రిషబ్ శెట్టి, రానా దగ్గుబాటి తమ పర్ఫార్మెన్స్‌లతో ఈ సినిమాను నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్లబోతున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, టీ-సిరీస్ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తున్నాయి.
The publish ప్రశాంత్ వర్మ కోసం అలాంటి పాత్రలో రానా..? first seemed on Newest Telugu Film Information, Evaluations, OTT, OTT Evaluations, Rankings.
