Sat. Jul 25th, 2026

టాలీవుడ్ యువతని ఈ కొన్నేళ్లలో అమితంగా ఆకట్టుకున్న పలు కల్ట్ ప్రేమ కథల్లో దర్శకుడు సాయి రాజేష్, నిర్మాత ఎస్ కే ఎన్ కాంపౌండ్ నుంచి వచ్చిన ప్రేమ కథా చిత్రాలు డెఫినెట్ గా ఉంటాయని చెప్పవచ్చు. వీరి నుంచి వచ్చిన ‘బేబి’ సినిమా సంచలన విజయం సాధిస్తే దాని తర్వాత ఇప్పుడు వచ్చిన ‘చెన్నై లవ్ స్టోరీ’ సినిమాకి కూడా మంచి ఆదరణ లభిస్తుంది.

అయితే చెన్నై లవ్ స్టోరీ లో కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరీ ప్రియా హీరో హీరోయిన్స్ గా నటించారు. కానీ ఈ ఇద్దరి కంటే ముందు బేబి జంట ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య ఈ సినిమా చేయాల్సి ఉన్న సంగతి తెలిసిందే. పలు కారణాలు చేత వారిద్దరూ ఈ కల్ట్ బొమ్మ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది.

కానీ వారు మిస్ చేసుకున్న గోల్డెన్ ఛాన్స్ ని కిరణ్, గౌరీలు ఒడిసిపట్టి మంచి ఫీడ్ బ్యాక్ ను ఇప్పుడు సొంతం చేసుకున్నారు. మెయిన్ గా వీరి పెర్ఫామెన్స్ లకి మరింత బెటర్ రెస్పాన్స్ ఆడియెన్స్ లో వస్తుండడం గమనార్హం. సో బేబి జంట మాత్రం ఇలాంటి సినిమా మిస్ చేసుకోకుండా కంటిన్యూ చేసి ఉంటే వారి ఖాతాలో మరో కల్ట్ ప్రేమ కథా చిత్రంగా ఇది నిలిచేది.

The put up ‘బేబి’ జంట మంచి సినిమా మిస్ చేసుకున్నారా!? first seemed on Newest Telugu Film Information, Opinions, OTT, OTT Opinions, Scores.