Sun. Jul 5th, 2026

మన దక్షిణాది సినిమా దగ్గర సినిమా, రాజకీయాలు రెండూ దగ్గర దగ్గర సంబంధాలు కలిగే ఉంటాయి. సినీ నటులు చాలామంది రాజకీయాల్లో ఉండడం ఇందుకు ప్రధాన కారణం అనుకోవచ్చు. ఇలా ప్రస్తుతం తమిళనాట ఇంట్రెస్టింగ్ పరిస్థితులు నెలకొన్నాయి. హీరో విజయ్ తన ఫస్ట్ అటెంప్ట్ లోనే సెన్సేషనల్ సక్సెస్ సాధించి సీఎం కావడం విశేషంగా మారింది.

ఈ తర్వాత తన పార్టీ లోకి త్రిష వస్తుంది అని అప్పటికే విజయ్ తో ఆమె సాన్నిహిత్యం బాహాటంగా కనిపించడం ఆసక్తిగా మారగా ఆ తర్వాత రాఘవ లారెన్స్ విజయ్ పార్టీలో చేరుతున్నారు అని తన తిరుచ్చి నుంచే పోటీ అంటూ వచ్చిన వార్తలు ఫైనల్ గా లారెన్స్ నిన్న క్లియర్ చేసాడు. దీనితో ఇప్పుడు మళ్లీ అందరి దృష్టి త్రిష వైపే వచ్చింది. విజయ్ వదిలిన స్థానంలో త్రిషనే పోటీ చేస్తుంది అని మళ్ళీ ముమ్మరంగా ప్రచారం సాగుతోంది. సో దీనిపై త్రిష ఏమన్నా క్లారిటీ ఇస్తుందో లేదో చూడాలి.

The publish మరోసారి త్రిష వైపే కన్ను.. విజయ్ కోసం ఎంట్రీ ఇస్తుందా? first gave the impression on Newest Telugu Film Information, Opinions, OTT, OTT Opinions, Rankings.