Tue. Apr 21st, 2026

బ్లాక్‌బస్టర్ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మరియు విక్టరీ వెంకటేష్‌ కలిసి చేస్తున్న తాజా చిత్రం ప్రస్తుతం మంచి హైప్‌ను సృష్టిస్తోంది. ఈ కాంబినేషన్‌లో మరోసారి సినిమా వస్తుందంటే ప్రేక్షకుల్లో ఈ చిత్రంపై అంచనాలు మరింత పెరిగాయి. త్రివిక్రమ్ దర్శకత్వంలో వెంకటేష్ నటించడం చాలా అరుదైన విషయం కావడంతో అభిమానుల్లో ప్రత్యేక ఉత్సాహం నెలకొంది.

వీరిద్దరి కాంబినేషన్‌పై ఇప్పటి నుంచే భారీ అంచనాలు మొదలయ్యాయి. గతంలో వీరి కాంబోలో వచ్చిన నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర బ్లాక్‌బస్టర్స్‌గా నిలిచాయి. ఇక ఇప్పుడు వీరి కాంబోలో వస్తున్న మూడో సినిమా కావడంతో ఈ మూవీ ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. కాగా ఈ సినిమా టైటిల్‌కు సంబంధించి తాజాగా ఓ వార్త వినిపిస్తోంది.

ఈ సినిమాకు ‘బంధు మిత్రుల అభినందనలతో’ అనే టైటిల్‌ను మేకర్స్ ఫిక్స్ చేయాలని భావిస్తున్నారట. ఈ టైటిల్‌తో ఇదొక పక్కా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అని తెలుస్తోంది. ఇక ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ భారీ స్థాయిలో నిర్మిస్తోంది.

The put up మరో ఇంట్రెస్టింగ్ టైటిల్‌తో త్రివిక్రమ్-వెంకీ మూవీ..? first gave the impression on Newest Telugu Film Information, Evaluations, OTT, OTT Evaluations, Scores.