Sat. Jul 25th, 2026

బాలీవుడ్ సూపర్ స్టార్ రణబీర్ కపూర్ హీరోగా నాచురల్ బ్యూటీ సాయి పల్లవి హీరోయిన్ గా దర్శకుడు నితీష్ తివారి తెరకెక్కిస్తున్న భారీ చిత్రమే ‘రామాయణ’. ఎన్నో అంచనాలు ఉన్న ఈ చిత్రాన్ని మేకర్స్ గ్రాండ్ గా రిలీజ్ కి తీసుకొచ్చే పనిలో భారీ ఎత్తున ప్రమోషన్స్ కూడా చేస్తున్నారు.

అయితే ఈ సినిమా తాలూకా అవైటెడ్ ట్రైలర్ ఇవాళే విడుదల కావాల్సి ఉంది కానీ మేకర్స్ దానిని ఊహించని విధంగా వాయిదా వేసి ప్రస్తుతం దేశంలో యువత చేస్తున్న నిరసన, అలాగే తమ గ్లోబల్ డిస్ట్రిబ్యూషన్ సాకులు చూపించి వాయిదా వేస్తున్నట్టు తెలిపారు. కానీ ఇక్కడ మరో వెర్షన్ వినిపిస్తుంది.

నిజానికి ట్రైలర్ కి జరగాల్సిన వి ఎఫ్ పనులు పూర్తి స్థాయిలో జరగకపోవడం మూలానే ట్రైలర్ లాంచ్ ని మేకర్స్ వాయిదా వేసినట్టుగా తెలుస్తుంది. ఆల్రెడీ ఆ మధ్య వచ్చిన గ్లింప్స్ లో గ్రాఫిక్స్ చూసే చాలామంది విమర్శలు చేశారు. సో ఈసారి మరింత కేర్ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక కొత్త డేట్ ఎప్పుడు ఇస్తారు అనేది చూడాలి మరి.

The put up ‘రామాయణ’ ట్రైలర్ రిలీజ్ వాయిదాకి అసలు కారణం ఇదా? first gave the impression on Newest Telugu Film Information, Critiques, OTT, OTT Critiques, Rankings.