ఇప్పుడు భారతీయ సినిమా నుంచి అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న అవైటెడ్ సినిమానే “వారణాసి”. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా ప్రియాంక చోప్రా హీరోయిన్ గా పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్ గా దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ సినిమానే ఇది కాగా భారీ బడ్జెట్ తో గ్రాండ్ విజువల్స్ తో ప్లాన్ చేస్తున్నారు.
అయితే ఈ సినిమాలో రణ కుంభగా కనిపించనున్న పృథ్వీ రాజ్ సుకుమారన్ జక్కన్నతో మొదటి నరేషన్ ఎక్స్ పీరియన్స్ అద్భుతం అని కొనియాడారు. రాజమౌళి కేవలం స్టోరీ చెప్పడమే కాదు ఫొటోలతో సహా వివరించి చెప్పడంతో తను సినిమా చూశానని ఆ రేంజ్ రాజమౌళి చెప్పిన విధానం అద్భుతం అని తెలిపారు.
దాదాపు మూడున్నర గంటల పాటు సాగిన ఆ నరేషన్ లో నాకు ఓ పక్క ఆ రూమ్ లో చల్లగా ఉంటే రాజమౌళి మాత్రం మొత్తం చెమటలు కక్కుతున్నారని కథని తను ఆ రేంజ్ లో ఎమోషన్ ని క్యారి చేస్తూ వివరిస్తున్నారు అన్నట్టు పృథ్వీరాజ్ చెప్పడం ఇపుడు వైరల్ గా మారింది.
The submit వారణాసి: రాజమౌళి నరేషన్ తో స్టన్నైన రణ కుంభ! first seemed on Newest Telugu Film Information, Critiques, OTT, OTT Critiques, Scores.
