మన తెలుగు సినిమా వద్ద తనదైన శైలితో ఆకట్టుకున్న ఎంతోమంది క్యారెక్టర్ ఆర్టిస్ట్ లలో ప్రముఖ హాస్య నటి పావలా శ్యామల కూడా ఒకరు. ఎన్నేన్నో సినిమాల్లో ఐకానిక్ పాత్రలు చేసిన వారు గత కొన్నాళ్ల పాటుగా అనారోగ్యంతో బాధ పడుతూ పోరాడుతున్నారు. ఈ క్రమంలో వారికి అనేక ఆర్ధిక ఇబ్బందులు కూడా ఎదురు కాగా టాలీవుడ్ ప్రముఖులు ఆమెకి సాయం చేశారు. కానీ చివరికి ఆమె విషయంలో మృత్యువే గెలిచింది.
ఈ జూలై 28 అర్ధ రాత్రి సమయంలో ఆమె హైదరాబాద్ ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచినట్టు నిర్ధారణ అయ్యింది. దీనితో ఈ విషాద సంఘటన టాలీవుడ్ ప్రముఖులని దిగ్భ్రాంతికి గురి చేసింది. ఆంధ్రావాలా, గోళీమార్ తదితర సినిమాల్లో ఆమె చేసిన ఫన్ సీన్స్ ఇప్పటికీ సోషల్ మీడియాలో వైరల్ అవుతాయి. మరి వారు లేని లోటు ఎవరూ తీర్చలేనిది.వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని మా 123తెలుగు యూనిట్ ఆకాంక్షిస్తుంది. ఓం శాంతి.
The put up విషాదం: ప్రముఖ నటి పావలా శ్యామల కన్నుమూత! first seemed on Newest Telugu Film Information, Critiques, OTT, OTT Critiques, Rankings.
