ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఆడియెన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న అవైటెడ్ హాలీవుడ్ సినిమా ఏదన్నా ఉంది అంటే అది మార్వెల్ సంస్థ సూపర్ హీరో సినిమా స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే అనే చెప్పాలి. మన దేశంలో కూడా భారీ హైప్ ని సెట్ చేసుకున్న ఈ సినిమా సాలిడ్ ప్రమోషన్స్ కూడా ఇప్పుడు జరుపుకుంటుంది.
అయితే ఓ పక్క ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్న వారు ఇంకోపక్క వరల్డ్ ఫుట్ బాల్ టోర్నమెంట్ ని కూడా ఎంజాయ్ చేస్తున్నారు. అయితే ఈ ఫిఫా వరల్డ్ ఫుట్ బాల్ ఛాంపియన్ షిప్ లో ఫేమస్ ప్లేయర్ అయినటువంటి మెస్సి కూడా లేటెస్ట్ స్పైడర్ మ్యాన్ ప్రోమోలో కనిపించడం ఆశ్చర్యంగా మారింది. అయితే ఇది సినిమాకి మరింత బూస్టప్ గా మారింది.
కానీ మెస్సి కనిపించిన ఆ కేవలం 20 సెకండ్స్ కోసం షాకింగ్ పారితోషకం అందుకున్నట్టు హాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. తను ఈ 20 సెకండ్స్ కనిపించేందుకు ఏకంగా 15 మిలియన్ డాలర్లు రెమ్యునరేషన్ అందుకున్నారట. అంటే 140 కోట్ల రూపాయలకు పైమాటే..
దీనితో ఈ క్రేజీ అంశం కూడా వైరల్ గా మారింది. టామ్ హోలాండ్, జెండాయ హీరో హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా జూలై 31న విడుదల కాబోతుండగా ఈ ఇండియాలో 30న ఇంగ్లీష్ తో పాటు అన్ని పాన్ ఇండియా భాషల్లో విడుదల కాబోతోంది.
The publish ‘స్పైడర్ మ్యాన్’తో మెస్సి.. 20 సెకండ్స్ కోసం షాకింగ్ రెమ్యునేషన్ అందుకున్న ఫేమస్ ఫుట్ బాల్ ప్లేయర్! first gave the impression on Newest Telugu Film Information, Critiques, OTT, OTT Critiques, Rankings.
