పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మోస్ట్ అవైటెడ్ చిత్రం ‘ఓజీ’ మరికొద్ది నిమిషాల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాతో పవన్ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తాడా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఇక ఈ సినిమాకు భారీ స్థాయిలో ప్రీమియర్ షోలు వేస్తున్నారు.
ఒక్క నైజాం ఏరియాలోనే ఈ చిత్రానికి 366 కి పైగా ప్రీమియర్ షోలు పడటం విశేషం. ఇది నైజాం ఏరియాలోనే ఆల్ టైమ్ రికార్డు అని మేకర్స్ చెబుతున్నారు. ఇక ఈ షోస్ అన్ని కూడా ఫుల్ అయిపోయినట్లు వారు పేర్కొన్నారు.
దీంతో ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి తుఫాన్ క్రియేట్ చేస్తుందా అని అభిమానులు ఆసక్తిగా చూస్తున్నారు. సుజీత్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో ప్రియాంక మోహన్, ఇమ్రాన్ హష్మి, శ్రియా రెడ్డి, తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.
The post నైజాం గడ్డపై ఓజీ సునామీ.. ప్రీమియర్స్‌తోనే రికార్డులు గల్లంతు..! first appeared on Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings.
