Wed. Apr 22nd, 2026

గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ నటిస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ‘అఖండ 2’ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. మొదట పవన్ కళ్యాణ్ OGతో క్లాష్ అవ్వాలని అనుకున్నా, నిర్మాణంలో ఆలస్యం కారణంగా రిలీజ్ వాయిదా పడింది. ఇక దీంతో ఈ సినిమా రిలీజ్ డేట్‌ను రీసెంట్‌గా బాలకృష్ణ స్వయంగా డిసెంబర్‌లో విడుదలవుతుందని ప్రకటించారు.

అయితే, తాజాగా పవన్ కళ్యాణ్ ఓజీ చిత్ర ప్రీమియర్ షోలో ‘అఖండ 2’ రిలీజ్ డేట్‌పై మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. ఈ చిత్రాన్ని డిసెంబర్ 5, 2025న ఈ హై-వోల్టేజ్ యాక్షన్ డ్రామా చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నట్లు ఓ టీజర్‌ను OG ప్రింట్స్‌కు జతచేసి ప్రదర్శించారు. ఇక ఈ వార్త నందమూరి అభిమానులకు నిజంగా పెద్ద పండుగ కానుందని చెప్పాలి.

ఈ చిత్రంలో సంయుక్తా మీనన్ హీరోయిన్‌గా నటిస్తుండగా, ఆది పినిశెట్టి విలన్‌గా కనిపించనున్నారు. బాలీవుడ్ చైల్డ్ ఆర్టిస్ట్ హర్షాలీ మల్హోత్రా ఈ చిత్రంతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇస్తోంది. 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ అచంట, గోపీనాథ్ అచంట భారీ స్థాయిలో నిర్మిస్తుండగా, ఎం.తేజస్విని నందమూరి సమర్పిస్తున్నారు. థమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు.

The post కన్ఫర్మ్ : ‘అఖండ 2’ రిలీజ్ డేట్ అప్పుడే..! first appeared on Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings.