Wed. Apr 22nd, 2026

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో ‘ఓజీ’ బ్లాక్ బస్టర్ అందుకున్న దర్శఖుడు సుజీత్, ఇప్పుడు తన నెక్స్ట్ చిత్రాన్ని ప్రారంభించాడు. నేచురల్ స్టార్ నానితో కలిసి తన కొత్త సినిమాను ఆయన ప్రారంభించాడు. “బ్లడీ రోమియో” అనే వర్కింగ్ టైటిల్‌తో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.

దసరా సందర్భంగా జరిగిన పూజా కార్యక్రమంతో ఈ సినిమాను అధికారికంగా లాంచ్ చేశారు. ఈ పూజా కార్యక్రమంలో నాని, సుజీత్‌తో పాటు చిత్ర బృందం పాల్గొనగా, విక్టరీ వెంకటేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

డిసెంబర్ 2025లో షూటింగ్ ప్రారంభమవుతుండగా, క్రిస్మస్ 2026 కానుకగా సినిమా విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్నారు. మిగతా క్యాస్టింగ్‌కు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడించనున్నారు.

The publish నాని-సుజీత్ చిత్రం ప్రారంభం.. పూజా కార్యక్రమాలతో అధికారికంగా లాంచ్ first seemed on Newest Telugu Film Information, Evaluations, OTT, OTT Evaluations, Scores.